Begin typing your search above and press return to search.

వాల్తేరు వీరయ్య... ట్రైలర్ వస్తే కానీ క్లారిటీ వచ్చేది లేదు

By:  Tupaki Desk   |   27 Dec 2022 9:20 AM GMT
వాల్తేరు వీరయ్య... ట్రైలర్ వస్తే కానీ క్లారిటీ వచ్చేది లేదు
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శృతి హాసన్‌ హీరోయిన్ గా నటించగా రవితేజ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫ్యాన్స్‌ కు ఇప్పటికే పిచ్చెక్కిస్తోంది.

ఈ సినిమా చిత్రీకరణ మొదలు అయ్యింది మొదలు చిరంజీవిని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా తాను చూపించబోతున్నట్లుగా దర్శకుడు బాబీ చెప్పుకొచ్చాడు.

చిరంజీవి అభిమాని అయిన బాబీ ఈ సినిమాలో తన అభిమాన నటుడిని తాను చూడాలి అనుకున్నట్లుగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా యొక్క కథ ఏంటీ.. నేపథ్యం ఏంటి అనేది మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంచుతూ వచ్చారు. హీరోయిజంను ఫుల్‌ గా ఎలివేట్‌ చేస్తూ అభిమానులను తెగ రంజింపజేసే విధంగా స్క్రీన్‌ ప్లే ఉంటుందని దర్శకుడు బాబీ సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడట.

ఈ సినిమా ట్రైలర్‌ విడుదల అయితే కథ ఏంటీ.. అసలు నేపథ్యం ఏంటి అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాల్తేరు వీరయ్య సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీ విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చింది. జనవరి 4వ తారీకు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమాలోని పాటలు మరియు పోస్టర్స్ చూస్తూ ఉంటే మాస్ ఎలిమెంట్స్‌ ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు ట్రైలర్‌ రాకపోవడంతో కథ మరియు స్క్రీన్‌ ప్లే విషయంలో క్లారిటీ లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.