Begin typing your search above and press return to search.

వాల్తేరు వీరయ్య.. ఒకేసారి మూడు షెడ్యూల్స్

By:  Tupaki Desk   |   10 Dec 2022 3:50 PM GMT
వాల్తేరు వీరయ్య.. ఒకేసారి మూడు షెడ్యూల్స్
X
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా ఈ సినిమా విడుదల తేదీ పై కూడా క్లారిటీ ఇచ్చారు. జనవరి 13వ తేదీన భారీ స్థాయిలో విడుదల కావడానికి మెగాస్టార్ సినిమా సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పనులు అయితే ఇంకా పూర్తిస్థాయిలో ఫినిష్ కాలేదు.

మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. అయితే నిర్మాతలు ముందుగానే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వడంతో దర్శకుడు ఇప్పుడు మిగతా షూటింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని స్పీడ్ పెంచుతున్నాడు. అయితే ముందుగానే పనులలో కొంత ఆలస్యం కావడం వలన ఇప్పుడు త్వర త్వరగా పూర్తి చేయాలని ఒకేసారి మూడు షెడ్యూల్స్ ను మొదలుపెట్టడం విశేషం. 

చిత్ర యూనిట్ లోని మూడు విభాగాలు మొత్తం కూడా హైదరాబాదులో ఉండగా మరొక యూనిట్ మలేషియా కు వెళ్ళింది. అలాగే ఫ్రాన్స్ లో కూడా ఒక యూనిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎడతెరిపి లేకుండా మూడు షెడ్యూల్స్ కూడా ఒకేసారి ఫినిష్ అవుతూ ఉండడం విశేషం.

డైరెక్టర్ బాబి తన కో డైరెక్టర్లందరికీ కూడా షెడ్యూల్స్ బాధ్యతను అప్పగించినట్లుగా తెలుస్తోంది. కీలకమైన హైదరాబాద్ షెడ్యూల్లో బాబి ఆధ్వర్యంలో సినిమా షూటింగ్ ను కొనసాగిస్తుండగా.. మిగతా వాళ్ళు మలేషియా ఫ్రాన్స్ లో బిజీగా ఉన్నారు.

ఇక బాబి ఎప్పటికప్పుడు వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పనులను ముగించుతున్నట్లుగా తెలుస్తోంది. విడుదల తేదీకి ఎంతో సమయం ఉండకపోవడం అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా త్వరగా ఫినిష్ చేయాలి కాబట్టి ఈ షెడ్యూల్స్ ను ఒకేసారి ఫినిష్ చేయడానికి దర్శకుడు బాబి రెడీ అయ్యాడు. పూర్తిగా కమర్షియల్ హంగులతో రాబోతున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.