Begin typing your search above and press return to search.

6PM బ్లాస్ట్! మెగా ర‌చ్చ‌కు రంగం సిద్ధం!!

By:  Tupaki Desk   |   8 Jan 2023 4:17 AM GMT
6PM బ్లాస్ట్! మెగా ర‌చ్చ‌కు రంగం సిద్ధం!!
X
ఈ సంక్రాంతి సీజన్ లో విడుదల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ భారీ చిత్రాలలో `వాల్తేర్ వీరయ్య` క్రేజ్ గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మెగాస్టార్ చిరంజీవి- మాస్ మహారాజా రవితేజ లాంటి ఇద్దరు పెద్ద మాస్ హీరోలు న‌టించిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ పై ప్రేక్షకుల్లో హైప్ నెల‌కొంది. శ‌నివారం సాయంత్రం ట్రైల‌ర్ విడుద‌ల‌య్యాక ఈ అంచ‌నాలు ఆకాశాన్నంటాయి. అయితే గత రెండు రోజులుగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో చాలా గందరగోళం నెలకొంది.

ముందుగా వేదికను విశాఖ‌ప‌ట్నం- ఆర్.కె. బీచ్ లో ఉంటుంద‌ని ఫిక్స్ చేశారు. ఆ తరువాత A.U (ఆంధ్రా యూనివ‌ర్శిటీ గ్రౌండ్స్) లోకి మార్చారు. మళ్లీ ఇంత‌లోనే R.K బీచ్ లో ఈవెంట్ ని నిర్వహించడానికి మేకర్స్ కు అనుమతి లభించింది. బీచ్ లో అందుకు అనుగుణంగా అవ‌స‌ర‌మైన‌ ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత కొత్త జి.ఓ జారీ చేయ‌డం బిగ్ ట్విస్టుగా మారింది. జీవో రూపంలో అనుమ‌తుల నిరాక‌ర‌ణ‌తో చివరగా A.U. కళాశాల మైదానం వేదికగా ఫిక్స‌యింది.

ఈ భారీ మెగా ఈవెంట్ నేటి సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవెనింగ్ 5 గం.ల నుంచే ఏయులో మెగా ర‌చ్చ షురూ కానుంది. ఎట్ట‌కేల‌కు చిత్ర‌ బృందం గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. జగన్ మద్దతుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. వాల్తేర్ వీరయ్య జనవరి 13న థియేటర్లలోకి రానుంది.