Begin typing your search above and press return to search.

పూన‌కాలు లోడింగ్..థియేట‌ర్ల‌లో ర‌చ్చ ర‌చ్చే!

By:  Tupaki Desk   |   30 Dec 2022 1:03 PM GMT
పూన‌కాలు లోడింగ్..థియేట‌ర్ల‌లో ర‌చ్చ ర‌చ్చే!
X
మెగాస్టార్ చిరంజీవి ఊర మాస్ పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌`. బాబి డైరెక్ష‌న్ లో మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ మూవీలో మాస్ మ‌హారాజా ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో అతిథిగా క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. దాదాపు 22 ఏళ్ల విరామం త‌రువాత చిరుతో క‌లిసి ర‌వితేజ న‌టిస్తున్న సినిమా ఇది. ఇందులో రవితేజ‌, చిరు సోద‌రులుగా క‌నిపించ‌బోతున్నారు. సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య వుండే అనుబంధాన్ని, ఎమోష‌న్స్ ని ద‌ర్శ‌కుడు బాబీ ఓ రేంజ్ లో ఆవిష్క‌రించిన‌ట్టుగా తెలుస్తోంది.

సినిమాలో ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా అతిథి పాత్ర‌లో 45 నిమిషాల నిడివి గ‌ల పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. సినిమా రిలీజ్ కి టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో వీరిద్ద‌రిపై `పూన‌కాలు లోడింగ్‌` అంటూ సాగే మాసీవ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నామంటూ చిత్ర బృందం ఇప్ప‌టికే ప్ర‌క‌టిస్తూ ఓ స్టిల్ ని రిలీజ్ చేసింది. నెట్టింట వైర‌ల్ గా మారిన నేప‌థ్యంలో న్యూఇయ‌ర్ గిఫ్ట్ గా `పూన‌కాలు లోడింగ్` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని మేక‌ర్స్ శుక్ర‌వారం ఆర్టీసి క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేట‌ర్లో అభిమానుల మ‌ధ్య విడుద‌ల చేశారు.

22 ఏళ్ల క్రితం చిరుతో క‌లిసి ర‌వితేజ `అన్న‌య్య‌` మూవీలో న‌టించాడు. అందులో చిరుతో క‌లిసి స్టెప్పులేసే ఛాన్స్ ర‌వితేజ‌కు ద‌క్క‌లేదు. ఇన్నేళ్ల త‌రువాత చిరుతో క‌లిసి న‌టించ‌డ‌మే కాకుండా ప‌క్క‌న స్టెప్పులేసే అవ‌కాశం రావ‌డంతో ర‌వితేజ ఈ అవ‌కాశాన్నే బాగానే స‌ద్వినియోగం చేసుకున్నట్టుగా క‌నిపిస్తోంది. చిరు మాత్రం ఈ రేంజ్ మాస్ సాంగ్ ప‌డితే దుమ్ము దులిపేయ‌డూ.. ఈ పాట‌లో అదే జ‌రిగిన‌ట్టుగా క‌నిపిస్తోంది. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతంతో పాటు కాన్సెప్ట్ ని అందించ‌గా ఈ పాట‌కు రోల్ రైడా సాహిత్యం అందించాడు.

రామ్ మిర్యాల‌తో పాటు రోల్ రైడా, చిరంజీవి, ర‌వితేజ ఆల‌పించారు. మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌చ్చే ఫ‌న్నీ బిట్స్ కు చిరు, ర‌వితేజ గ‌ళం అందించ‌డం విశేషం. మెడ‌లో చైన్‌, చెవికి పోగు..రెడ్ క‌ర‌ల్ పూల చొక్కా, చేతికి వాచ్‌... త‌న‌దైన మాస్ మూవ్స్ తో చిరు ఈ పాట‌లో అద‌ర‌గొట్టేశాడు. శేఖ‌ర్ మాస్ట‌ర్ డ్యాన్స్ కంపోజ్ చేసిన ఈ పాట‌లోని ఓ మూవ్ మెంట్ లో సిగ‌రేట్ వెళిగిస్తూ అగ్గిపెట్టేని స్టైల్ గా చిరు విసిరేసిన తీరు మాస్ కి పూన‌కాలు తెప్పించ‌డం కాయంగా క‌నిపిస్తోంది.

చిరుతో క‌లిసి మాస్ రాజా ర‌వితేజ కూడా త‌న‌దైన స్టైల్ స్టెప్పుల‌తో కేక‌లు పెట్టించాడు. చుట్టూ డ్యాన్స‌ర్ మ‌ధ్య చేతులు క‌దుపుతూ ల‌య‌బ‌ద్దంగా చిరు, ర‌వితేజ చేసిన డ్యాన్స్ మూవ్స్ అదుర్స్ అనిపించేలా వున్నాయి. భారీ స్థాయిలో డ్యాన్స‌ర్స్.. అదిరిపోయే సెట్ ప్రాప‌ర్టీ.. పూల‌తో అలంక‌రించిన తీరు.. క‌ల‌ర్ కెమెరా ఫ్రేమ్స్‌ ప్రేక్ష‌కుల‌కు క‌నువిందు చేసులా వున్నాయి. పూన‌కాలు లోడింగ్..థియేట‌ర్ల‌లో ర‌చ్చ ర‌చ్చే అనేలా వుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.