Begin typing your search above and press return to search.

వాల్తేరు వీరయ్య.. స్టోరీ లైన్ ఇదేనా?

By:  Tupaki Desk   |   4 Nov 2022 5:30 AM GMT
వాల్తేరు వీరయ్య.. స్టోరీ లైన్ ఇదేనా?
X
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తరువాత ఎలాగైనా గాడ్ ఫాదర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని అనుకున్నారు. అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. చాలా ఏరియాలలో ఈ సినిమా కొంత నష్టాలను మిగిల్చింది. దీంతో తదుపరి సినిమా బిజినెస్ పై కూడా ప్రభావం పడే అవకాశం అయితే ఉంది.

ఇక వాల్తేరు వీరయ్య ఫస్ట్ లుక్ టీజర్ వచ్చింది అనే హడావిడి తప్పితే అసలు అది సినిమాపై పెద్దగా అంచనాలు అయితే క్రియేట్ చేయలేకపోయింది. సినిమాల్లోనే ల్యాగ్ ఉంటుంది అనుకుంటే దర్శకుడు బాబీ ఫస్ట్ లుక్ టీజర్ లో కూడా చాలా ల్యాగ్ చూపించాడు అని ట్రోలింగ్ కూడా నడిచింది. ఇక ఈ సినిమాలో రవితేజ నటిస్తున్నాడు అనే ఒక అంశం అయితే ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

టాక్ ఏమాత్రం బాగున్న కూడా సంక్రాంతి ఫైట్ లో వాల్తేరు వీరయ్య పై చేయి సాధించే అవకాశం అయితే ఉంది. ఇక దర్శకుడు బాబి అయితే కమర్షియల్ అంశాలను హైలెట్ చేస్తూ సినిమాలను చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ రోజుల్లో ఆ మ్యాజిక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది సినిమా విడుదల వరకు నమ్మకంగా ఎవరు చెప్పలేరు. ఇక వాల్తేరు వీరయ్య సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వెలువడుతున్నాయి.

నిజాయితీగా ఉండే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పై పడిన నిందను తన అన్నయ్య ఎలా తొలగించాడు. అలాగే మళ్ళీ అతనిపైనే ప్రశంసలు కురిసేలా ఎలా చేశాడు? అనేది ఈ సినిమాలో అసలు కథ.. అని తెలుస్తోంది.

దర్శకుడు బాబి రవితేజను తీసుకున్నప్పుడే ఇందులో ఒక బలమైన స్టోరీలైన్ ఉంటుంది అనేది ప్రేక్షకుల్లో నమ్మకం అయితే ఏర్పడింది. మరి ఆ నమ్మకానికి తగ్గట్టుగా దర్శకుడు ఈ రెగ్యులర్ స్టోరీ లైవ్ తో సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.