Begin typing your search above and press return to search.

మౌత్ ఆర్గాన్‌తో చిరు చేసిన సిగ్నేచర్ డ్యాన్స్ మూవ్ మెంట్

By:  Tupaki Desk   |   19 Dec 2022 12:45 PM GMT
మౌత్ ఆర్గాన్‌తో చిరు చేసిన సిగ్నేచర్ డ్యాన్స్ మూవ్ మెంట్
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `వాల్తేర్ వీర‌య్య` ప్ర‌మోష‌న్ యాక్టివిటీస్ స్పీడ‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో ఇప్ప‌టికే తొలి లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. పార్టీ సాంగ్ ఆద్యంతం మెగా అభిమానుల్ని మెప్పిస్తోంది. ఓ సెక్ష‌న్ శ్రోత‌లు పెద‌వి విరిచినా మెజార్టీ వ‌ర్గం మెచ్చిన పాట‌గా నిలిచింది. తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే సెకెండ్ సింగిల్ కూడా రిలీజ్ అయింది.

`నువ్వు సీత‌వైతే... నేను రాముడినంటా` అంటూ ప‌ల్ల‌వితో సాగే సాంగ్ విడుద‌లైంది. పాట ఆద్యంతం శ్రోత‌ల్ని ఆక‌ట్టుకుంటుంది. పాట‌లో చిరు...శ్రుతి హాస‌న్ జోడీ రొమాంటిక్ గా క‌నిపిస్తుంది. తెర‌పై జంట అంతే అందంగానూ హైలైట్ అవుతున్నారు. ఫ్రాన్స్‌లోని సుందరమైన మంచు పర్వత శ్రేణులలో ఈ పాట‌ని చిత్రీక‌రించారు. విజువల్స్ బాగున్నాయి.

దేవీ శ్రీ ప్ర‌సాద్ ట్యూన్ కంపోజిషన్ పెప్పీగా ఉన్నాయి. ట్యూన్ స‌హా సాహిత్యం చెవుల‌కు విన‌సొంపుగా ఉంది. జస్ప్రీత్ జాజ్ స్వరాలు బాగున్నాయి. మౌత్ ఆర్గాన్‌తో చిరు చేసిన సిగ్నేచర్ డ్యాన్స్ మూవ్ మెంట్ బాగుంది. మెగా అభిమానులిచే ఈ సిగ్నెచ‌ర్ స్టెప్ప త‌ప్ప‌క విజిల్స్ వేయిస్తుంది. చిరంజీవి-మేటి హీరోయిన్ల‌తో మంచు ప‌ర్వ‌తాల్లో ఆడిపాడిన ఓల్డ్ హిట్స్ గుర్తుకు రావ‌డం ఖాయం. చిరంజీవి మంచు ప‌ర్వాత‌ల్లో సైతం త‌న‌దైన మార్క్ స్టెప్పుల‌తో ప్రేక్ష‌కుల్ని ఉర్రూత‌లూగించారు.

కంబ్యాక్ త‌ర్వాత ఇలాంటి పాట‌ల్లో న‌టించ‌లేదు. ఇదే తొలిసారి కావ‌డంతో విజువ‌ల్ గా చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. ఇప్ప‌టికే ఈపాట‌కి సంబంధించిన విజువ‌ల్స్ కొన్నింటిని చిరంజీవి లైవ్ లొకేష‌న్ నుంచి షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే.
డీఎస్పీ -చిరు కాంబోలో ఇప్ప‌టికే మంచి పెప్పీ పాటలున్నాయి. వాటి ప్లోనూ కొన‌సాగిస్తున్నారు.

అయితే తాజా పాట శ్రోతలను ఆకట్టుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. ఇంకా సినిమా నుంచి మ‌రిన్ని సింగిల్స్ రానున్నాయి. ఈ సినిమా జ‌న‌వ‌రి 13న విడుదలకు రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. జనవరి మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.