Begin typing your search above and press return to search.

వాల్తేరు వీర‌య్య లుక్ నెట్టింట వైర‌ల్..ఇదేంది బాస్!

By:  Tupaki Desk   |   11 Oct 2022 8:30 AM GMT
వాల్తేరు వీర‌య్య లుక్ నెట్టింట వైర‌ల్..ఇదేంది బాస్!
X
మెగాస్టార్ చిరంజీవి మాస్ అప్పీరియ‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అన్న‌య్య‌కి మెగా ఇమేజ్ ని తీసుకొచ్చింది త‌న‌లో ఆ మాస్ అప్పీరియ‌న్స్ అన్న‌ది సుస్ప‌షం. 90 స్ లో బాక్సాఫీస్ ని ఆ మాస్ లుక్ తోనే ర‌ప్ఫాడించేసేవారు. కాల‌క్ర‌మంలో ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు సినిమాలు చేసుకుంటూ రావ‌డంతో నెమ్మ‌దిగా మాస్ అప్పీరియ‌న్స్ కి దూర‌మ‌య్యారు.

ఇక కంబ్యాక్ త‌ర్వాత చిరు ఎంపిక‌ల విధానం పూర్తిగా మారిపోయింది. 'ఖైదీనంబ‌ర్ 150'..'సైరా న‌ర‌సింహారెడ్డి'...'..ఆచార్య' లో క్లాసీ ట‌చ్ ఉన్న పాత్ర‌లే చేసారు. అన్న‌య్య‌లో ఆ వ్య‌త్యాసాన్ని గ‌మ‌నించి యంగ్ మేక‌ర్ బాబి ఒక‌ప్ప‌టి చిరంజీవిని మ‌ళ్లీ తెర‌పై ఆవిష్క‌రించాల‌ని న‌డుం బిగించారు. త‌న అభిమాన‌మంతా సినిమాలో క‌నిసిస్తుంద‌ని ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే హిట్ ఇచ్చేసారు.

మెగాస్టార్ ని అస‌లైన అభిమానులు తెర‌పై ఎలా చూడాల‌నుకుంటున్నారో? అంత‌కు మించి క‌నిపిస్తార‌ని సంకేతాలు పాస్ పాస్ చేసారు. ప్ర‌స్తుతం ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో 'వాల్తేరు వీర‌య్య' చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ తోనే కంటెంట్లో మాస్ కోణం తెలుస్తుంది. ఇందులో చిరు వీర‌య్య అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. వైజాగ్ నేప‌థ్యంలో సాగే ప‌క్కా మాస్ చిత్ర‌మిది.

దీంతో వీర‌య్య పాత్ర‌లో చిరు ఎలా క‌నిపిస్తారు? అని ఒక‌టే ఉత్కంఠ అభిమానుల్లో నెల‌కొంది. ఇటీవ‌లే మెగాస్టార్ సైతం మాంచి ఊపున్న మాస్ చిత్రం బాబితో చేస్తున్నట్లు స్వ‌యంగా వెల్ల‌డించారు. దీంతో అభిమానుల్లో అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. సాక్షాత్తు చిరు నోట మాట మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. తాజాగా సినిమాలో చిరు మాస్ లుక్ ఒక‌టి నెట్టింట చక్కెర్లు కొడుతోంది.

చిరు ఆహార్యం ఆద్యంతం మాస్ ని త‌ల‌పిస్తుంది. చేతిలో స్మార్ట ఫోన్..చేతికి కాశీ తాడులు..వేలికి ఉంగ‌రాలు..కాస్ట్యూమ్స్ ...చిరు సిట్టింగ్ స్టైల్..ఫేస్ లో ఎక్స్ ప్రెష‌న్ అన్ని మాస్ లో పూన‌కాలు తెప్పించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రీ ఈరిగా..సూరిగా అన్నంత మాసీవ్ కాదు గానీ... ఆ మాస్ లోనూ ఓ స్టైల్ క‌నిపిస్తుంది. వింటేజ్ చిరుని త‌ల‌పిస్తున్నారు.

ఈ ఫోటోలు ఆన్ సెట్స్ నుంచి లీకైన‌ట్లు తెలుస్తోంది. కానీ పిక్ చాలా క్లారిటీగా ఉంది. మ‌రి లీక్ ఎలా జ‌రిగిందో? ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. అభిమానులు చిరును చూసుకుని మురిసిపోతున్నారు. లీక్ నేప‌థ్యంలో యూనిట్ వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌ల్ని ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. సోష‌ల్ మీడియా నుంచి ఆ ఫోటోల్ని తొల‌గించే కార్య‌క్ర‌మం చేస్తోంది. ఇక బాస్ ఇటీవ‌లే గాడ్ పాద‌ర్ తో భారీ స‌క్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఉత్సాహంతో వీర‌య్య తోనూ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.