Begin typing your search above and press return to search.

మైత్రీ మూవీ మేక‌ర్స్‌ మెడ‌ పై సంక్రాంతి క‌త్తి!

By:  Tupaki Desk   |   18 Dec 2022 12:30 AM GMT
మైత్రీ మూవీ మేక‌ర్స్‌ మెడ‌ పై సంక్రాంతి క‌త్తి!
X
క్రేజీ స్టార్ల సినిమాల‌ని ప్ర‌త్యేక వేళ‌ల్లో ఫెస్టివెల్స్ కి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తుంటారు. రిలీజ్ డేట్ ని ముందే ప్ర‌క‌టించేసిన ఆ టార్గెట్ కు రిలీజ్ కావాల‌ని, అనుకున్న స‌మ‌యానికి రిలీజ్ చేయాల‌ని హ‌డావిడీ చేస్తుంటారు. అయితే అవి కొన్ని సార్లు మేక‌ర్స్ మెడ‌పై క‌త్తిలా మారుతూ టెన్ష‌న్ పెడుతూ వుంటాయి. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో మైత్రీ మూవీ మేక‌ర్స్ వారిని చిరంజీవి, బాల‌కృష్ణ న‌టిస్తున్న సినిమాలు టెన్ష‌న్ కు గురి చేస్తున్నాయి.

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వీర సింహారెడ్డి`. గోపీచంద్ మ‌లినేని ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా కీల‌క పాత్ర‌ల్లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌, హ‌నీ రోజ్ న‌టిస్తున్నారు. క‌న్న‌డ హీరో దునియా విజ‌య్ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా క‌నిపించ‌నున్న ఈ మూవీని 2023 సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ని కూడా ప్ర‌క‌టించేశారు.

రిలీజ్ కి నెల‌రోజులు కూడా లేదు. కానీ ఈ మూవీ మాత్రం షూటింగ్ ఇప్ప‌టికీ పూర్తి చేసుకోలేదు. దీంతో టీమ్ అంతా రాత్రీ ప‌గ‌లు అని తేడా లేకుండా సంక్రాంతి రిలీజ్ కోసం శ్ర‌మిస్తున్నారు. ఇక ఈ మూవీతో పాటు సంక్రాంతి 13న `వాల్తేరు వీర‌య్య‌` కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌`. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. రీసెంట్ గా చిరు, శృతి హాస‌న్ ల‌పై ఓ పాట చిత్రీక‌రణ కోసం చిత్ర బృందం ఇటీవ‌ల ఫ్రాన్స్ వెళ్లింది.

సాంగ్ షూట్ పూర్త‌యింద‌ని ఇటీవ‌ల చిరు పాట‌లోని చ‌ర‌ణాల‌ని లీక్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికీ ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి కాక‌పోవ‌డంతో టీమ్ అంతా ఉరుకులు పురుగులు పెడుతోంది. ఈ రెండు సినిమాల‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో మైత్రీ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ సినిమాల కోసం క‌ఠోరంగానే శ్ర‌మిస్తోంది. ఈ రెండు సినిమాల రిలీజ్ ల‌కు నెల రోజులు కూడా లేక‌పోవ‌డంతో మైత్రీ మెడ‌పై క‌త్తి వేలాడుతోంద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

ఇలాంటి పెద్ద సినిమాల కోసం నెల రోజుల పాటు ప్ర‌మోష‌న్స్ కోసం కేటాయిస్తుంటే ఈ సినిమాలు షూటింగ్ లు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి కాక‌పోవ‌డంతో మైత్రీ వారికి ఊప‌రాడ‌టం లేద‌ట‌. దీంతో వారు టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. ఫూటింగ్ పూర్తి కాగానే సమాంత‌రంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో పాటు ప్ర‌మోష‌న్స్ ని నిర్వ‌హించాల‌ని మైత్రీ వారు ప్లాన్ ని రెడీ చేశార‌ట‌. భారీ ఈవెంట్ ల‌తో పాటు ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ ల‌ని భారీ స్థాయిలో నిర్వ‌హించ‌బోతున్నార‌ట‌. అయితే వారి టీమ్ మెంబ‌ర్స్ కి మాత్రం ఈ సంక్రాంతి బిగ్ టాస్క్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.