Begin typing your search above and press return to search.

వీర‌య్య ఇంట‌ర్వెల్ కార్డ్ అలా షాకిస్తుంది!

By:  Tupaki Desk   |   10 Jan 2023 3:58 AM GMT
వీర‌య్య ఇంట‌ర్వెల్ కార్డ్ అలా షాకిస్తుంది!
X
ప్ర‌స్తుతం వాల్తేరు వీర‌య్య డీఐ వ‌ర్క్ స‌హా పెండింగ్ ప‌నులు శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి. నిన్న డీఐలో కూడా ఇంకా బెట‌ర్ మెంట్ ల కోసం వీర‌య్య టీమ్ ప్ర‌య‌త్నించింది. చిరంజీవి స్వ‌యంగా అన్ని ప‌నుల్ని స‌మీక్షిస్తుండ‌గా దేవీశ్రీ‌- అర్థ‌ర్ స‌హా బాబి రేయింబ‌వ‌ళ్లు ఫైన‌ల్ ఔట్ పుట్ లో బెట‌ర్ మెంట్ కోసం ప‌ని చేస్తున్నార‌ని స‌మాచారం.

ఈ సినిమాకి ఎన్నో స‌క్సెస్ మీట్ లు ఉంటాయి.. అక్క‌డ చాలా మాట్లాడుతాం.. అని ఎంతో ధీమాగా ప్ర‌క‌టించిన టీమ్ అందుకు త‌గ్గ‌ట్టే మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ తో మాస్ ఫ్యాన్స్ లో పూన‌కాలు పుట్టించ‌డం ఖాయ‌మ‌ని డీఐ జ‌రుగుతున్న‌ అన్న‌పూర్ణ ల్యాబ్ నుంచి తాజాగా ఒక లీక్ అందింది.

తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అదిరిపోయేలా ఉంటుంది. మాస్ వీల‌లు విజిల్స్ తో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతాయ‌ని ల్యాబ్ లో ప‌ని చేస్తున్న స‌న్నిహిత మిత్రుడు ఒక‌రు లీక్ అందించారు. ఇంత‌కీ ఇంట‌ర్వెల్ కార్డ్ ఏమ‌ని వేస్తున్నారు? అంటే...

''వ‌ర‌ల్డ్ ఆఫ్ వీర‌య్య అరాచ‌కం'' అని ఇంట‌ర్వెల్ కార్డ్ వేస్తున్నారు. 'విశ్రాంతి' అని సింపుల్ గా ఇంట‌ర్వెల్ కార్డ్ వేయ‌డం లేదు. ఇంత‌కుముందు ప్రీరిలీజ్ వేదిక‌పైనా ద‌ర్శ‌కుడు బాబి ఈ విష‌యాన్ని అధికారికంగానే వెల్ల‌డించారు కూడా! పూన‌కాలు లోడింగ్ అని ఇంట్ర‌డ‌క్ష‌న్ వేస్తున్నాం.. వ‌ర‌ల్డ్ ఆఫ్ వీర‌య్య అరాచ‌కం'' అని ఇంట‌ర్వెల్ కార్డ్ వేస్తున్నాం.. మీ అంచ‌నాలు ఎక్క‌డ ఉన్నా వాటిని రీచ్ అవుతాం అంటూ బాబి ధీమాను క‌న‌బ‌రిచాడు. అత‌డి కాన్ఫిడెన్స్ సాలిడ్ స్పీచ్ విన్న‌వారికి వీర‌య్య బంప‌ర్ హిట్టు కొట్టేయ‌డం ఖాయ‌మ‌ని అనిపించింది.

బాబి గ‌త ఈవెంట్లో చాలా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను మాట్లాడాడు. ఈ సినిమాకి దేవీశ్రీ రామ‌జోగ‌య్య చంద్ర‌బోస్ పాట‌లు రాసారు. చంద్ర‌బోస్ వీర‌య్య థీమ్ ని రాయ‌గా అది ఇప్పుడు రింగ్ టోన్ల‌లో ఆటోల్లోను మోగుతోంది అని అన్నారు.

ప్ర‌కాష్ రాజ్ ద్విపాత్ర‌ల్లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటార‌ని కూడా లీకులిచ్చేశారు. ఒక్క ఫోన్ కాల్ తో బాస్ కోసం వ‌చ్చారు ఆయ‌న‌. చిరుతో సినిమా అన‌గానే వెంట‌నే ఓకే చేసారు అని తెలిపారు. నాలాగే ప్ర‌కాష్ రాజ్ గారు కూడా చిరంజీవి అభిమాని అని కూడా బాబి తెలిపారు. పీటర్ హెయిన్స్ ఒక రెండు స్ట‌న్నింగ్ ఫైట్స్ కి కంపోజ్ చేశార‌ని కూడా తెలిపారు. వీట‌న్నిటికీ డీఐ వ‌ర్క్ జ‌రుగుతోంది. వాల్తేరు వీర‌య్య సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న విడుద‌ల‌వుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.