Begin typing your search above and press return to search.

ఎదురుచూపుల్లోనే ఆనందం వెతుక్కుంటే

By:  Tupaki Desk   |   23 April 2016 7:30 AM GMT
ఎదురుచూపుల్లోనే ఆనందం వెతుక్కుంటే
X
నసీరుద్దీన్ షా - కల్కి కొచ్చిన్ లు ప్రధాన పాత్రల్లో నటించిన వెయిటింగ్. ఈ మూవీలో నసీరుద్దీన్ షా- సుహాసినిలు జంట కాగా.. కల్కికొచ్లిన్ - రజత్ కపూర్ లు మరొకట జంట. అయితే.. ఇద్దరి జీవితంలో ఒకే రకమైన ప్రయాణం చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి అనేదే ఈ వెయిటింగ్.

ఇటు సుహాసిని, అటు రజత్ కపూర్ లు హాస్పిటల్ బెడ్ పై కోమాలో ఉంటారు. ఆ సమయంలో వారి కోసం వెయిటింగ్ చేస్తూ ఒకరికొకరు పరిచయం అవుతారు నసీరుద్దీన్ షా - కల్కి కొచ్చిన్. ఆ తర్వాత వీరి జీవితంలో ఏం జరిగిందనేదే వెయింటింగ్ మూవీ. నసీరుద్దీన్ షాతో కల్కి నటనను పోల్చలేకపోయినా.. యాక్టింగ్ లో మాత్రం ఇరగీదీసేసింది ఈ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్.

ఇక.. ట్రైలర్ ఎండింగ్ లో వాట్ ఈజ్ ట్విట్టర్ అంటూ నసీరుద్దీన్ షా అడిగే ప్రశ్న, తీరు అయితే.. నవ్వులు పూయించడం ఖాయం. సీరియస్ కథాంశమే అయినా.. దీన్ని అనురాధా మీనన్ తెరకెక్కించిన తీరు అద్భుతం అంటున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు అందుకున్న వెయిటింగ్.. ఏప్రిల్ 29న ఇండియాలో విడుదలవుతోంది.