Begin typing your search above and press return to search.

వైజయంతి వారి 'ఎదురు లేని మనిషి'కి 45 ఏళ్లు

By:  Tupaki Desk   |   13 Dec 2020 10:32 AM IST
వైజయంతి వారి ఎదురు లేని మనిషికి 45 ఏళ్లు
X
అశ్వినీదత్‌ స్థాపించిన వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ లో ఎన్నో అద్బుత సినిమాలు వచ్చాయి. బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ కూడా షాక్‌ అయ్యేలాంటి సినిమాలను కూడా అశ్వినీదత్ నిర్మించారు అనడంలో సందేహం లేదు. అతి చిన్న వయసులోనే నిర్మాతగా మారిన ఆయన అనుకోకుండా వచ్చిన అదృష్టంతో మొదటి సినిమాను ఎన్టీఆర్‌ తో నిర్మించే అవకాశం ను దక్కించుకున్నారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ లో మొదటి సినిమా ఎన్టీఆర్ తో 'ఎదురు లేని మనిషి' గా నిర్మించారు. కె బాపయ్య దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా విడుదల అన్ని థియేటర్లలో 50 రోజులు ఆడింది.

మొదటి సినిమాతోనే అశ్వినీదత్‌ భారీ లాభాలను దక్కించుకున్నారు. ఎంతో మంది స్టార్స్‌ తో సినిమాలు చేసిన ఆయన మొదటి సినిమాను ఎన్టీఆర్‌ తోనే చేయడం చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటూ ఉంటాడు. అశ్వినీదత్‌ వారి వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ లో మొదటగా విడుదల అయిన ఎదురు లేని మనిషి సినిమా విడుదల అయ్యి 45 ఏళ్లు పూర్తి అయ్యింది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ కు జోడీగా వాణిశ్రీ నటించింది. ఎదురు లేని మనిషి టైటిల్‌ ను రాఘవేంద్ర రావు సూచించారట. ఇక బ్యానర్‌ కు పేరును ఎన్టీఆర్‌ పేరు సూచించారు అంటూ అశ్వినీదత్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.