Begin typing your search above and press return to search.
ప్రతిభను నమ్మిన వైజయంతీ కు కాసుల పంట
By: Tupaki Desk | 19 Aug 2022 5:32 AM GMTసినిమా నిర్మాణంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్న వైజయంతి మూవీస్ ఆ మధ్య డీలా పడింది. ఆ సమయంలో మళ్లీ వైజయంతీ నుండి సినిమాలు వస్తాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో వైజయంతీ మూవీస్ వారు 'శక్తి'ని కోల్పోయారు అనుకుంటూ ఉండగా మళ్లీ పుంజుకున్నారు. అశ్వినీదత్ బౌన్స్ బ్యాక్ అయ్యారు. వరుస సినిమాలతో పూర్వ వైభవం దక్కించుకుంటున్నారు.
ఏమాత్రం అంచనాలు లేకుండా సినిమాలను తీస్తూ పెద్ద విజయాలను దక్కించుకుంటున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం మొదలుకుని మహానటి.. జాతిరత్నాలు... సీతారామం సినిమాలు అలా సైలెంట్ గా విజయాలను దక్కించుకుంటున్నాయి.
నాగ్ అశ్విన్ ఎప్పుడైతే వైజయంతి మూవీస్ లో చేరాడో అప్పటి నుండి కథల ఎంపిక విషయంలో మరియు దర్శకుల ఎంపిక లో శ్రద్ధ చూపిస్తున్నారు.
ప్రతిభ ఆధారంగానే అవకాశాలు ఇస్తున్నారు. గత సినిమా సక్సెస్ అయితేనే ఛాన్స్ ఇస్తాం అన్నట్లుగా కాకుండా కథ మరియు ఆ దర్శకుడు చెప్పే విధానం నచ్చితే సినిమాను చేసేందుకు వైజయంతి వారు ముందుకు వస్తున్నారు. అలా వచ్చినవే జాతిరత్నాలు మరియు సీతారామం సినిమాలు. అనుదీప్ మొదటి సినిమా ప్లాప్ అయినా కూడా జాతిరత్నాలు సినిమా చేసే అవకాశం ను ఇచ్చారు.
జాతిరత్నాలు సినిమా భారీ లాభాలను తెచ్చి పెట్టడంతో పాటు మంచి పేరును తెచ్చింది. ఇక దర్శకుడు హను రాఘవపూడి చాలా స్ట్రగుల్ అవుతున్న సమయంలో వైజయంతి వారు ఒక కమర్షియల్ సినిమా కాకున్నా కూడా సీతారామం సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ప్రతిభ ను నమ్మి సినిమాలను చేసినందుకు గాను జాతిరత్నాలు మరియు సీతారామం సినిమా తో వైజయంతి వారికి కాసుల వర్షం కురుస్తోంది.
ప్రస్తుతం వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కే అనే భారీ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా పాన్ వరల్డ్ మూవీ అన్నట్లుగా ఉంటుందట. టైమ్ ట్రావెల్ అనే యూనివర్శిల్ సబ్జెక్ట్ తో ఈ సినిమా ను రూపొందిస్తున్నారు. కనుక మరో విజయం వైజయంతి వారికి ఖాయం.