Begin typing your search above and press return to search.
లూసీఫర్ రీమేక్.. వినాయక్ ముందున్న రెండు ఛాలెంజెస్
By: Tupaki Desk | 28 Oct 2020 1:20 PM ISTమెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ పై ఆసక్తిగా ఉన్నాడు. మొదట సాహో దర్శకుడు సుజీత్ కు రీమేక్ బాధ్యతలు అప్పగించారు. కాని చిరు ఇమేజ్ కు తగ్గట్లుగా సుజీత్ స్ర్కిప్ట్ రెడీ చేయడంలో సుజీత్ విఫలం అయ్యాడట. దాంతో ఆ రీమేక్ బాధ్యతలు వివి వినాయక్ వద్దకు వచ్చాయి. గత మూడు నాలుగు నెలలుగా లూసీఫర్ తెలుగు రీమేక్ స్క్రిప్ట్ వర్క్ ను వినాయక్ చేస్తున్నాడు. తన టీమ్ తో కలిసి లూసీఫర్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ అద్దడంతో పాటు చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్లుగా కథను మార్చారు.
ఇటీవలే స్క్రిప్ట్ ను చిరంజీవికి వినియించిన వినాయక్ కు సెకండ్ హాఫ్ లో మార్పులు సూచించారట. సెకండ్ హాఫ్ పలు మార్పులు చేర్పులు సూచించడంతో మళ్లీ మార్చే పనిలో పడ్డారట. ఇక ఈ సినిమాలో మరో నటుడి పాత్ర ఉంటుంది. ఒరిజినల్ వర్షన్ లో ఫృథ్వీరాజ్ పోషించిన పాత్రకు తెలుగులో ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై కూడా చర్చలు జరుగుతున్నాయి.
ఆ పాత్రకు రానా అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాని రానా అందుకు సిద్దంగా ఉన్నాడా అనేది అనుమానమే. లూసీఫర్ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో మార్చడంతో పాటు సెకండ్ హీరో పాత్రను ఎంపిక చేయడం వినాయక్ కు రెండు ఛాలెంజ్ లు. ఈ రెండు ఛాలెంజ్ ల విషయంలో వినాయక్ సక్సెస్ అయితేనే తెలుగు లూసీఫర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.