Begin typing your search above and press return to search.

అఖిల్ తప్పే.. బౌన్స్ బ్యాక్ అవుతా

By:  Tupaki Desk   |   25 Dec 2015 11:55 AM IST
అఖిల్ తప్పే.. బౌన్స్ బ్యాక్ అవుతా
X
ఓ సినిమా ఫెయిల్ అయితే.. తప్పంతా ఒకరి పైకి నెట్టేసే పరిస్థితి చూస్తూనే ఉన్నాం. నేరం ఇతరుల పైకి తోసేసి, తామే ప్రతిభావంతులమని, తమ ప్రతిభ వాడుకోకపోవడం కారణంగానే మూవీ ఫెయిల్ అయిందనే ఆరోపణలు కూడా వినిపించాయి. కానీ మాస్ డైరెక్టర్ గా ఎనలేని గుర్తింపు పొందిన వినాయక్ మాత్రం తప్పంతా తనదే అంటున్నాడు.

అక్కినేని వారసుడు అఖిల్ ని పరిచయం చేస్తూ.. కొత్త పాయింట్ తో ప్రయోగం చేద్దామనే ఆలోచన బెడిసి కొట్టిందన్నాడు వినాయక్. "ఆ ప్రయోగం వికటించింది. నేను తప్పు చేసిన మాట వాస్తవమే. త్వరలో ఓ మంచి చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవుతాను" అన్నాడు. ఈ ఒక్క మాటతో అఖిల్ డిజాస్టర్ కు సంబంధించిన భారం మొత్తం తన నెత్తినే వేసుకున్నట్లు అయింది. అయినా సరే, ఏ మాత్రం ఆలోచించకుండా.. కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టరే కాబట్టి... ఆ తప్పు నాదే అనడం మాత్రం ప్రశంసనీయమే.

అలాగే అఖిల్ మూవీకి వచ్చిన దారుణమైన నెగిటివ్ రివ్యూలు కూడా ఆ సినిమా పరాజయంలో ఓ భాగమే అని చెప్పాలి. దీనికి కూడా వినాయక్ నుంచి సానుకూల స్పందనే వచ్చింది. 'ఒక సినిమాని ప్రజల్లోకి, మాస్ లోకి తీసుకెళ్లేందుకు మూవీ జర్నలిస్టులు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. సినిమా ఇండస్ట్రీలో వారు వెలకట్టలేని ఒక భాగం' అంటూ వారిపై తన ప్రేమను చాటి చెప్పాడు వినాయక్. ఈ మధ్య కాలంలో ఒక ఘోరమైన పరాజయాన్ని ఇంత స్పోర్టివ్ గా తీసుకుని, తప్పు అంగీకరించిన డైరెక్టర్ వినాయక్ ఒక్కడే అని చెప్పాలి.