Begin typing your search above and press return to search.

తలకు విగ్ పెట్టుకున్న సీనియర్ దర్శకుడు!

By:  Tupaki Desk   |   11 Sept 2019 12:13 PM IST
తలకు విగ్ పెట్టుకున్న సీనియర్ దర్శకుడు!
X
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు విగ్గులతో దర్శనం ఇస్తారనేది తెలిసిన సంగతే. వయసు మీద పడ్డాకా కూడా కొందరు విగ్ లు మెయింటెయిన్ చేస్తూ ఉంటారు. దీనికి హీరోలు కూడా అతీతం కాదు. ఒక్కో సారి ఒక్కో రకమైన విగ్ తో వాళ్లు కనిపిస్తూ ఉంటారు.

ఇక మరి కొందరు విగ్ పెట్టుకుని కూడా రహస్యం అన్నట్టుగా దాన్ని కవర్ చేస్తూ ఉంటారట ఇండస్ట్రీలో. కొంతమంది స్టార్ హీరోలవి ఒరిజినల్ హెయిర్ కాదని, వారు విగ్గులు ధరిస్తారనే ప్రచారమూ ఉంది. వాటికి ఎలాంటి ధ్రువీకరణలూ లేవు.

ఆ సంగతలా ఉంటే.. తాజాగా ఒక దర్శకుడు విగ్ తో కనిపించారు. ఆయనే వీవీ వినాయక్. ఒక సినిమా ప్రోగ్రామ్ కు అటెండ్ అయ్యి వినాయక్ అక్కడ డిఫరెంట్ హేర్ స్టైల్ తో కనిపించారు. అది పెట్టుడు జుట్టు అని ఇట్టే తెలిసిపోతోందని పరిశీలకులు అంటున్నారు.

ఇంతకీ కథేంటి అంటే.. వినాయక్ ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం వినాయక్ చాలానే కష్టపడుతూ ఉన్నారట. తన బాడీ షేప్ లో కూడా మార్పు తీసుకొస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన హేర్ స్టైల్ లో కూడా ఇలా విగ్ తో మార్పును చూపించినట్టుగా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు!