Begin typing your search above and press return to search.

వినయ్‌.. అలా వర్కవుతుంది సుమీ!!

By:  Tupaki Desk   |   13 Oct 2015 9:30 AM GMT
వినయ్‌.. అలా వర్కవుతుంది సుమీ!!
X
ఓ స్టార్ హీరో త‌న‌యుడిని, అక్కినేని కుటుంబ హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు వినాయ‌క్‌. మామూలుగా ఎవ‌రికైనా అలాంటి సంద‌ర్భంలో ఒత్తిడి అనిపించ‌డం స‌హ‌జం. అంత పెద్ద లెగ‌సీని కాపాడే హీరోని త‌యారు చేయ‌డం అంటే ఆషామాషీ కాదు. అందుకే వినాయ‌క్ పూర్తి ఒత్తిడిలో ఉన్నాడా? అన్న సందేహాలు స‌హ‌జం.

ప‌రిశ్ర‌మ అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. మ‌రోవైపు ఏఎన్నార్ అభిమానులు, నాగార్జున అభిమానులు , సామాన్య జ‌నం అంతా ఎంతో ఉత్సుక‌త‌తో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్‌ లో అఖిల్ సినిమా రిలీజ‌వుతోంది. ఈ ద‌స‌రా కానుక‌గా 22 రిలీజ్ ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి సంద‌ర్భంలోనూ వి.వి.వినాయ‌క్‌ ని చూస్తే అత‌డిలో టెన్ష‌న్ మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న వెరీ కూల్ గ‌య్‌లా ఉన్నాడు. ఈరోజు ఉదయం మీడియాకు కనిపించి చాలా ఎక్సయిటింగ్‌ గా మట్లాడారూ కూడా.

అఖిల్ హిట్ కొట్టేస్తాడు అన్న ధీమా తో ఉన్నాడు. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌ కి ఆది ఇచ్చిన‌ప్ప‌టిలా, నితిన్‌ కి దిల్ ఇచ్చిన‌ప్ప‌టిలా, బెల్లంకొండ శ్రీ‌నుకి అల్లుడు శీను ఇచ్చిన‌ప్ప‌టిలా.. చాలా చాలా కూల్‌గా క‌నిపిస్తున్నాడు. అవ‌న్నీ బ్లాక్‌ బ‌స్ట‌ర్‌ లే. అఖిల్ కూడా బ్లాక్‌ బ‌స్ట‌రే అన్నంత ధీమాగా ఉన్నాడు. విన‌య్‌ లోని విన‌యం అలా వ‌ర్క‌వుటవుతుంది సుమీ. అక్టోబర్‌ 22న తెలుస్తోంది మనకు.