Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ 'వాయిస్' సెంటిమెంట్ ఇది!

By:  Tupaki Desk   |   30 Jan 2017 10:22 AM GMT
ఎన్టీఆర్‌ వాయిస్ సెంటిమెంట్ ఇది!
X
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ఏమీ కొదవ ఉండదు! ఎవరి స్థాయిలో వాళ్లకు ఈ సెంటిమెంట్స్ ఉండటం అత్యంత సహజం. ఈ విషయంలో తన సెంటిమెంట్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తపడ్డాడు యంగ్ టైగర్. తనను రిక్వస్ట్ చేసిన వారి విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించాడు కూడా! ఇంతకూ విషయం దేనిగురించి అంటారా.... "ఘాజీ" తెలుగు వెర్షన్ గురించి.

ఈ మధ్యకాలంలో స్టార్స్ సినిమాలకు మరో స్టార్ వాయిస్ ఓవర్ చెప్పించడం జరుగుతుంది. ఈ క్రమంలో రానా నటించిన "ఘాజీ" సినిమాకు హిందీ వాయిస్ ఓవర్ బిగ్ బీ అమితాబ్ చెప్పారు. ఇదే క్రమంలో తెలుగు వాయిస్ ఓవర్ చెప్పేందుకు ఎన్టీఆర్‌ ను అప్రోచ్ అయ్యింది చిత్ర బృదం. అయితే ఈ అప్రోచ్ ను సున్నితంగా తిరస్కరించారట జూనియర్. అయితే.. దీనికి గల కారణాన్ని తన సెంటిమెంట్ గా చెప్పాడట.

గతంలో తాను వాయిస్ ఓవర్ చెప్పిన చిత్రాలు పెద్దగా విజయవంతం కాలేని కారణంగా ఇకపై ఏ సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పకూడదని నిర్ణయించుకున్న కారణంగా... "ఘాజీ" సినిమాకి ఆ సెంటిమెంట్ తోనే వాయిస్ ఓవర్ రిక్వస్ట్ ను తిరస్కరిస్తున్నానని తెలిపారట. దీంతో ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి తో వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారట! ఈ లెక్కన చూసుకుంటే... వాయిస్ ఓవర్స్ రూపంలో ఇక జూనియర్ వాయిస్ వినబడనట్లే!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/