Begin typing your search above and press return to search.

కొత్త పెళ్లికూతురికి షాక్ ట్రీట్‌

By:  Tupaki Desk   |   8 Dec 2018 6:33 AM GMT
కొత్త పెళ్లికూతురికి షాక్ ట్రీట్‌
X
అందాల పెళ్లి కూతురు పీసీకి ఒక‌దాని వెంట ఒక‌టిగా స‌ర్‌ ప్రైజ్‌ లే స‌ర్‌ ప్రైజ్‌ లు. ఇంత‌వ‌ర‌కూ ఏ కొత్త‌ పెళ్లికొడుకు ఇవ్వ‌ని రీతిలో ప్రేయ‌సి ప్రియాంక చోప్రాకు ఊహించ‌ని కానుక‌లిస్తూ స‌ర్‌ ప్రైజ్‌ లు ఇస్తున్నాడు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి అత్యంత ఖ‌రీదైన స్టిఫానీ అండ్ కో వ‌జ్ర‌పు ఉంగ‌రాన్ని నిశ్చితార్థం కోసం కానుక‌గా ఇచ్చాడు. అటుపై పెళ్లిలో పీసీ కోసం రింగును - ఆభ‌ర‌ణాల్ని స్టిఫానీ అండ్ కోలో కొనుక్కొచ్చాడు. ఇందుకోసం ఏకంగా దుకాణాల ష‌ట్ట‌ర్‌ లే మూయించేశాడు అప్ప‌ట్లో.

ఆ గిఫ్టులు చాల‌వ‌న్న‌ట్టు .. వీలున్న ప్ర‌తి సంద‌ర్భంలో పీసీని సంభ్ర‌మాశ్చ‌ర్యాల్లో ముంచెత్తుతూ కానుక‌లిచ్చి స‌ర్‌ ప్రైజ్‌ లు ఇస్తున్నాడు నిక్. డిసెంబ‌ర్ 1,2 తేదీల్లో జోద్ పూర్‌ లో పెళ్లి పూర్త‌య్యాక‌, ఆ వెంట‌నే ఈ కొత్త జంట దిల్లీ - ముంబైలో చుట్టి వ‌చ్చారు. దిల్లీలో చుట్టాలు - బంధువుల కోసం ప్ర‌త్యేకించి రిసెప్ష‌న్‌ ని ఏర్పాటు చేసింది పీసీ. త‌దుప‌రి ముంబైలో ఓ గ్రాండ్ రిసెప్ష‌న్‌ కి ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20న ముంబై రిసెప్ష‌న్ కి బాలీవుడ్ సెల‌బ్రిటీలు స‌హా ఇండ‌స్ట్రియ‌లిస్టులు - రాజకీయ నాయ‌కులు భారీగా త‌ర‌లి వ‌చ్చే ఛాన్సుంద‌ట‌.

తాజాగా పీసీకి నిక్ ఓ స‌ర్‌ ప్రైజ్ కేక్‌ ని కానుక‌గానిచ్చాడు. ఈ కేక్‌ పై వోగ్ అమెరికా క‌వ‌ర్‌ పేజీపై పీసీ ఫోటో ప్రింట్‌ ని ముద్రించార‌ట‌. మొత్తానికి ప్రేయ‌సిని బుట్ట‌లో వేసే అన్ని విద్య‌ల్ని నిక్ ప్ర‌ద‌ర్శిస్తున్నాడ‌ని యూత్ గుసగుస‌లాడేస్తోంది. ఇక వెడ్డింగ్ ఈవెంట్‌ లో పీసీతో క‌లిసి మామ్ మ‌ధుచోప్రా డ్యాన్సులు చేస్తున్న ఫోటోలు రివీల‌య్యాయి.