Begin typing your search above and press return to search.

బ్లాక్ లో బాలీ సెలబ్స్.. వావ్!

By:  Tupaki Desk   |   26 Sep 2017 7:28 AM GMT
బ్లాక్ లో బాలీ సెలబ్స్.. వావ్!
X
ఈ ఏడాదికి మన దేశానికి సంబంధించి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఎవరు.. ఈ విషయాన్ని సింపుల్ గా చెప్పేయడం చాలా కష్టమైన విషయం. ఓ పెద్ద సెర్చింగ్ జరగాలి.. పోటీలు జరగాలి.. జనాల అభిప్రాయాలు తెలుసుకోవాలి.. ఓటింగ్ జరగాలి.. అంతా చేసి.. ఎవరినీ హర్ట్ చేయకుండా ఉండేలా అనౌన్స్ మెంట్ చేయాలి. ఇదేమీ చిన్న తతంగం కాదు. అయినాసరే.. వోగ్ ఇండియా మ్యాగజైన్ ఈ కాంటెస్ట్ మొదలుపెట్టింది.

తమ మేగజైన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా.. ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ను ఎంపిక చేయడం ప్రారంభించింది. ఇందుకోసం ఇప్పటికే విడుదల చేస్తున్న ఫోటోస్ భలే ఆసక్తిగా ఉంటున్నాయి. ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అంటే.. కేవలం ఫామ్ లో ఉన్న వాళ్లనో.. గ్లామర్ ఫీల్డ్ కి చెందిన వాళ్లనో తీసుకుంటే సరిపోదు. వాళ్లతో సమానంగా ఫేమ్ ఉన్న ఇతర రంగాలకు చెందిన మహిళలను కూడా ఇన్ క్లూడ్ చేయాలి కదా. ఇప్పుడు అలాంటివే కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. సీనియర్ బ్యూటీ ట్వింకిల్ ఖన్నా.. అందాల తార సోనమ్ కపూర్.. జార్జియస్ బ్యూటీ అనుష్క శర్మలు.. ఒకరితో ఒకరు పోటీ పడి పోజు ఇస్తే.. అదే ఫోటోలో పక్కనే కరణ్ జోహార్ కూడా సేమ్ బ్లాక్ డ్రెస్ లో సందడి చేస్తున్నాడు.

మరో ఫోటోలో అయితే.. బిలియనీర్ ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ.. ఇండియన్ మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ల మధ్యలో.. షారూక్ ఖాన్ పోజులు ఇచ్చేశాడు. మోడల్స్ పద్మా లక్ష్మి.. నటాలియాలతో ప్రియాంక చోప్రా ఇచ్చి స్టిల్ అయితే.. అదరహో అనాల్సిందే. ఇంకా ఈ రేసులో చాలామందే ఉంటారు కానీ.. ఇంట్రడక్షనే ఈ స్థాయిలో ఉంటే.. ఇక రిజల్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో!