Begin typing your search above and press return to search.

పుట్టిన రోజు కేక్.. ఎవ‌ర్‌ గ్రీన్ కానుక‌

By:  Tupaki Desk   |   6 Dec 2015 7:30 AM GMT
పుట్టిన రోజు కేక్.. ఎవ‌ర్‌ గ్రీన్ కానుక‌
X
ప్యాష‌న్ ప్ర‌పంచ‌పు రారాజు మ‌నీష్ మ‌ల్హోత్రా. బాలీవుడ్‌ ని ద‌శాబ్ధాలుగా ఏల్తున్న ప్ర‌ఖ్యాత ప్యాష‌న్ డిజైన‌ర్ ఆయ‌న‌. అత‌డి ప‌రిచ‌యాలు వేరు. అత‌డి అనుభ‌వం వేరు. అత‌డి ట్యాలెంటు వేరు. అందుకే ఎంద‌రు ఫ్యాష‌న్ డిజైన‌ర్లు ఉన్నా మ‌నీష్ కావాల‌నే స్టార్ల‌కు కొద‌వే లేదు. ద‌టీజ్ మ‌నీష్‌ మల్హోత్రా

శ్రీ‌దేవి - కాజోల్‌ - క‌రిష్మా - క‌రీనా - ఆలియాభ‌ట్.. వీళ్లంద‌రికీ ప‌ర్స‌న‌ల్ డిజైన‌ర్ మ‌నీష్. ఇంకా బాలీవుడ్‌ లో ఎంద‌రో క‌థానాయిక‌లు - క‌థానాయ‌కుల‌కు అత‌డు ప‌ర్స‌న‌ల్ డిజైన‌ర్‌. నాటి నుంచి నేటి త‌రం క‌థానాయిక‌ల‌కు ఆయ‌నే ప్యాష‌న్ డిజైన‌ర్‌. అందుకే అత‌డు పుట్టిన‌రోజు చేసుకుంటే ఇచ్చే కానుక ఎలా ఉండాలి? అని ఆలోచించిన వోగ్ ఇండియా మ్యాగ‌జైన్ బృందం ఓ అద్భుత‌మైన కానుక‌ను డిజైన్ చేశారు.

అత‌డు త‌న కెరీర్‌ లో ప‌నిచేసిన క‌థానాయిక‌ల ఫోటోల‌తో వోగ్ క‌వ‌ర్‌ పేజీని ఓ కేక్ రూపంలో త‌యారు చేసి ముద్రించారు. దానిని ట్విట్ట‌ర్‌ లో షేర్ చేసుకుని ఎంతో ప‌ర‌వ‌శుడ‌య్యాడు మ‌నీష్‌. ఇలాంటి ఆలోచ‌న అరుదైన‌ది. అంద‌మైన‌ది. మ‌న‌సు నింపేసేది. అంటూ ఆనందంతో త‌బ్బి ఉబ్బిబ్బ‌య్యాడు. నిజ‌మే మ‌రి ఓ క‌వ‌ర్ పేజీని కేక్‌ లా మ‌లిచి వోగ్ తెలివితేట‌లు చూపించింది మ‌రి. అటు మ‌నీష్‌ కి ప్ర‌చారం, ఇటు వోగ్‌ కి ప్ర‌చారం క‌లిసొచ్చింది క‌దూ!