Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సిక్స్ ప్యాక్ సుందరాంగి

By:  Tupaki Desk   |   13 May 2017 8:35 AM GMT
ఫోటో స్టోరి: సిక్స్ ప్యాక్ సుందరాంగి
X
ఉందా లేదా అన్నట్టుండే నాజూకైన నడుము.. కోమలమైన మొహం.. పాలుగారే చెక్కిళ్లు.. అబ్బో... అమ్మాయిల అందం గురించి మన కవులు ఎంతో గొప్పగా వర్ణించేశారు. దానికి తగ్గట్టే మన డైరెక్టర్లు కూడా హీరోయిన్ల నడుము ఒంపులు, క్లీవేజ్ సొంపులు మాక్సిమం చూపిస్తూ ప్రేక్షకులను మెప్పించేయాలని చూస్తుంటారు.

ఈ ట్రెండుకు భిన్నంగా నా రూటే సెపరేటు అంటోంది పాపులర్ విజె బాని. ఈ అమ్మడిని చూస్తే ఇప్పటివరకు అందం గురించి చెప్పిన డిఫినిషన్లు అన్నింటినీ తిరిగి రాయాల్సిందే. స్టార్ హీరోలకు పోటీగా అన్నట్టుగా కండలవీ పెంచింది. దీనికితోడు జిమ్ లో వర్కవుట్లు అవీ గట్టిగానే చేసినట్టుంది సిక్స్ ప్యాక్ లాంటిదేదో సంపాదించేసింది. కండలపై ఫుల్ గా టాటూలు అవీ వేయించుకుని అందాలు ఆరబోస్తూ ఇటీవల ఫిట్ లుక్ అనే మ్యాగజైన్ కవర్ పేజీకి ఫోజులిచ్చింది. సోగ కళ్లతో... రెచ్చగొట్టే చూపులతో.. కుర్రాళ్ల మతులు పొగొట్టే డ్రస్సింగ్ తో బాని ఫొజులు చూసిన వారెవరయినా చిత్తయిపోవడం ఖాయం. చక్కనమ్మ చిక్కినా అందమేనన్నది ఎప్పటి నుంచో ఉన్నమాట. బానిని చూశాక మాత్రం చక్కనమ్మ కండలు పెంచినా అందమేనని ఒప్పుకోక తప్పదు.

అన్నట్లు ఈ కండల సుందరికి తెలుగుతో కాస్త పరిచయముంది. ఆ మధ్య వచ్చిన తిక్క సినిమాలో రాజేంద్రప్రసాద్ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది. ఏమైనా లావయిపోయి అవకాశాలు తక్కువయిపోయాయని బాధ పడుతున్న హీరోయిన్లంతా బాని బాట పడితే సరి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేయొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/