Begin typing your search above and press return to search.

టాలీవుడ్ వైజాగ్ షిఫ్ట‌వుతోంది.. ఇదే ప్రూఫ్‌!

By:  Tupaki Desk   |   18 Feb 2020 2:00 PM IST
టాలీవుడ్ వైజాగ్ షిఫ్ట‌వుతోంది.. ఇదే ప్రూఫ్‌!
X
రాజు గారు త‌లుచుకుంటే సాధ్యం కానిది ఏది? ప‌్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వాధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీరు చూస్తుంటే మ‌రో టాలీవుడ్ కి అంకురార్ప‌ణ చేయ‌డ‌మే ధ్యేయంగా ఉన్నార‌ని ఇప్ప‌టికే సంకేతాలు అందాయి. మెగాస్టార్ చిరంజీవి అంత‌టి వారే స్వ‌యంగా ఆ సంగ‌తిని మా డైరీ 2020 లాంచ్ వేదిక‌ పై వెల్ల‌డించారు ఈ సంగ‌తిని. ఒక కొత్త ప‌రిశ్ర‌మ స్థాపిస్తే ఏం చేయాలో మీరే చెప్పండి అని సీఎం జ‌గ‌న్ త‌న‌ని అడిగార‌ని కూడా చిరు వెల్ల‌డించారు. దీంతో ప‌రిశ్ర‌మ పెద్ద‌ల్లో వైజాగ్ టాలీవుడ్ పై ఆస‌క్తి నెల‌కొంద‌న్న భావ‌న నెల‌కొంది.

తాజా క‌థ‌నాల ఫ‌లిత‌మో... ఏపీలో తాజా స‌న్నివేశం ఎఫెక్ట్ చేసిందో ఏమో కానీ.. ద‌గ్గుబాటి వారి మైండ్ సెట్ లో మార్పు వ‌చ్చింద‌నే చెబుతున్నారు. నిన్న మొన్న‌టివ‌ర‌కూ చ‌డీ చ‌ప్పుడు చేయ‌క మిన్న‌కుండిపోయిన అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు ఇప్పుడు వైజాగ్ టాలీవుడ్ లో భాగం కావాల‌నుకుంటున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌లి కాలంలో వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ ని డి.సురేష్ బాబు ప‌ట్టించుకోలేదు. దాంతో ఇక్క‌డ స్టూడియో పూర్తిగా రూపురేఖ‌లు మారిపోయింద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. కానీ ఇప్పుడు రాజ‌ధాని షిఫ్ట్ వార్త‌ల అనంత‌రం స్టూడియోని రీమోడ‌ల్ చేశారని తెలుస్తోంది. ఇటీవ‌ల కొంత‌ ప‌ట్టించుకుంటున్నారట‌. ఇప్పుడు ఏకంగా రానా క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ హిర‌ణ్య‌క‌సిప కు సంబంధించిన భారీ సెట్స్ వేస్తున్నారు. నిజానికి హైద‌రాబాద్ నాన‌క్ రామ్ గూడ‌లో భారీ సెట్స్ వేసి హిర‌ణ్య క‌సిప చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని భావించినా ఆ ప్లాన్ ని ఇప్పుడు విర‌మించార‌ని తెలుస్తోంది. ఇక‌పై వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ ని పూర్తి యాక్టివ్ గా ఉంచాల‌న్న ప్లాన్ సురేష్ బాబుకు ఉంద‌ని వెల్ల‌డైంది. అంటే పెద్దాయ‌న మైండ్ సెట్ మారిన‌ట్టేన‌న్న మాటా ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

ఇక వైజాగ్ టాలీవుడ్ నిర్మాణం లో మెగాస్టార్ చిరంజీవి కీల‌క భూమిక పోషించ‌నున్నార‌న్న వార్త‌ల న‌డుమ‌.. ప‌రిశ్ర‌మ పెద్ద‌లంతా ఎంతో ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నార‌ని తెలుస్తోంది. చిరు ఇప్ప‌టికే వైజాగ్ ఔట‌ర్ లో భారీ స్టూడియో నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప‌లు స్టూడియోల నిర్వాహ‌కులు ప్రోత్సాహ‌కాల్ని బ‌ట్టి స్టూడియోల్ని ప్లాన్ చేయనున్నార‌ని తెలుస్తోంది. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ స‌హా ప‌లువురు సంగీత దర్శ‌కులు రికార్డింగ్ స్టూడియోల‌కు ప్లాన్ చేస్తున్నారు.