Begin typing your search above and press return to search.

పెద్దోళ్లు ఇద్దరూ కుర్రాడికి హెల్ప్ చేశారు

By:  Tupaki Desk   |   27 Aug 2017 4:38 AM GMT
పెద్దోళ్లు ఇద్దరూ కుర్రాడికి హెల్ప్ చేశారు
X
ఈ వారం విడుదలైన సినిమాల్లో విజయ్ దేవరకొండ మూవీ అర్జున్ రెడ్డి సెన్సేషనల్ వసూళ్లు సాధిస్తోంది. నిజానికి అర్జున్ రెడ్డి సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా.. కలక్షన్ల పరంగా ఇంకో పెద్ద సాయం జరిగింది. ఓ స్టార్ హీరోతో పాటు మరో పెద్ద హీరో కూడా ఈ యంగ్ హీరోకు తెగ సాయం చేసేశారు.

వేరే సినిమాలు ముందుగా అనౌన్స్ అయినా.. అవి వాయిదా పడ్డంతో.. ఈ వారం అర్జున్ రెడ్డికి సోలో రిలీజ్ అయ్యే అవకాశం వచ్చింది. అయితే.. వివేకం అంటూ తమిళ స్టార్ హీరో అజిత్.. విఐపీ2 అంటూ ధనుష్.. టాలీవుడ్ బాక్సాఫీస్ మీద దాడి చేశారు. వీటిలో వీఐపీ2 మీద అంచనాలు తక్కువగానే ఉన్నా.. రఘువరన్ బీ టెక్ టైపులో మాయ చేసినా చేయచ్చని అంతా అనుకున్నారు. మరోవైపు వివేకంపై ముందునుంచి ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. కంప్లీట్ యాక్షన్ జోనర్ లో రూపొందిన ఈ మూవీ.. బీ సీ సెంటర్లలో కలెక్షన్స్ దున్నేస్తుందని ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే.. ఈ అంచనాలు అన్నీ తారుమారు అయ్యి.. వివేకం అండ్ విఐపి 2 డిజాష్టర్లు అయ్యాయ్.

వివేకం.. వీఐపీ2లు ఫ్లాప్ కావడం.. అర్జున్ రెడ్డి సినిమాకు భారీగా ప్లస్ అయ్యింది. మరో కొత్త సినిమా ఏదీ అందుబాటులో లేకపోవడంతో.. ఆడియన్స్ కు సింగిల్ ఆప్షన్ అయిపోయింది. ఈ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై బాగానే కనిపించింది కూడా. తొలి రోజే 4 కోట్లకు పైగా షేర్ ను అర్జున్ రెడ్డి వసూలు చేయగలిగిందంటే.. అందులో కంటెంట్ కి మించి సాయపడ్డ అంశాలు కూడా ఉన్నాయి. ముద్దు పోస్టర్ వివాదం.. పబ్లిక్ ఫంక్షన్ లో బూతులు చెప్పించడం.. ఇవన్నీ కూడా సినిమా వసూళ్లకు హెల్ప్ అయ్యాయి.