Begin typing your search above and press return to search.

ఆ ప్రెస్ మీట్ వల్లే కెరీర్ నాశనమైందంటున్న హీరో

By:  Tupaki Desk   |   1 Jun 2017 8:44 AM GMT
ఆ ప్రెస్ మీట్ వల్లే కెరీర్ నాశనమైందంటున్న హీరో
X
బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ను ఆరాధించే వాళ్లే కాదు.. అతడిని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్లూ లేకపోలేదు. అలాంటి వాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు.. వివేక్ ఒబెరాయ్. సల్మాన్ తో వివేక్ ఒబెరాయ్ గొడవ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయే వీళ్లిద్దరి గొడవకు కారణం. ముందు సల్మాన్ తో ప్రేమాయణం నడిపిన ఐశ్వర్య.. అతడి నుంచి నుంచి విడిపోవడంపై అప్పట్లో బాలీవుడ్లో చాలా కథనాలే వినిపించాయి. సల్మాన్ నుంచి విడిపోయాక ఐశ్వర్య.. వివేక్ చెంతకు చేరింది. ఇది సల్మాన్ కు నచ్చలేదని.. వివేక్ ను బెదిరించాడని రూమర్లు వినిపించాయి. ఆ నేపథ్యంలో అప్పట్లో వివేక్ ప్రెస్ మీట్ పెట్టి సల్మాన్ మీద విమర్శలు గుప్పించడం సంచలనమైంది.

తాజాగా అప్పటి గొడవపై వివేక్ ఒబెరాయ్ ఒక టీవీ షోలో ఓపెన్ అయ్యాడు. ఆ ప్రెస్ మీట్ వల్ల తన కెరీరే నాశనమైందని చెప్పుకొచ్చాడు. సల్మాన్ తనను ఎలా ఇబ్బంది పెడుతున్నది వివరించేందుకు ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమైనపుడు.. ఆ విషయం తెలిసి ముందు రోజు రాత్రి సల్మాన్ తనకు 40 సార్లకు పైగా ఫోన్ చేసినట్లు వివేక్ వెల్లడించాడు. ప్రెస్ మీట్ పెడితే చంపేస్తానంటూ సల్మాన్ బెదిరించాడని చెప్పాడు. అయినప్పటికీ తాను వెనక్కి తగ్గలేదని.. ఐతే ప్రెస్ మీట్ పెట్టడం వల్ల తాను భారీ మూల్యమే చెల్లించుకున్నానని అన్నాడు. తనకు అవకాశాలు రాకపోవడంలో సల్మాన్ పాత్ర ఉందన్నట్లుగా అతను మాట్ల్లాడాడు. అంతకుముందు బాగున్న తన కెరీర్ ఆ ప్రెస్ మీట్ తర్వాతే నాశనమైందని వివేక్ తెలిపాడు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టేలా తనను ఉసిగొల్పింది ఐశ్వర్యారాయేనని.. తాను దెబ్బ తినడంలో ఆమె పాత్ర కూడా ఉందన్నట్లుగా మాట్లాడాడు వివేక్. సల్మాన్ కు ఇప్పటికీ తన మీద కోపం పోలేదని.. ఇప్పటికీ తనపై ధ్వేషాన్ని కొనసాగిస్తున్నాడని చెప్పాడు. తనకు బేసిగ్గా సల్మాన్ మనస్తత్వం నచ్చదని వివేక్ తేల్చి చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/