Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: హాలీవుడ్ తరహాలో వివేగం

By:  Tupaki Desk   |   11 May 2017 12:18 PM IST
టీజర్ టాక్: హాలీవుడ్ తరహాలో వివేగం
X
ఇప్పుడు యుట్యూబ్లో మరోసారి తమిళ హీరో అజిత్ కుమార్ ఫ్యాన్స్ తమ టాలెంట్ చూపించేస్తున్నారు. ఎందుకంటే 'వివేగం' టీజర్ ఎట్టకేలకు రిలీజవడంతో ఇప్పుడు అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయ్. ఇంతకీ ఈ టీజర్ ఎలా ఉందో చూద్దాం పదండి.

ఆల్రెడీ అజిత్ తో వీరం.. వేదాళమ్ వంటి సినిమాలను తీసిన దర్శకుడు శివ.. ఇప్పుడు వివేగం సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అసలు మన హీరో సిక్స్ ప్యాక్ నిజంగానే చేశాడా లేదా అనేది టీజర్ పోస్టర్ వచ్చినప్పటి నుండి పెద్ద డౌట్. ఇకపోతే టీజర్ అదిరిపోయింది. ఒక స్పెషల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్.. ఇంటర్ పోల్ ఆఫీసర్. అలాగే అతను ఇతర దేశాల్లో కొనసాగించే మిషన్స్.. మొత్తానికి ఒక హాలీవుడ్ సినిమా తరహాలో ఈ సినిమాను రూపొందించారు. ''నెవర్ గివ్ అప్'' అంటూ తిరిగే హీరో.. చివరకు తన మిషన్ ను ఎలా నిర్వర్తిస్తాడనేదే కథ. అనిరుథ్‌ మ్యూజిక్ అదిరిపోయింది.

ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ అండ్ అక్షరా హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.