Begin typing your search above and press return to search.

వివాహ భోజ‌నంబు లిరిక్.. వ్వాటే మ్యాన్ ఫ‌న్నీ స‌త్యా

By:  Tupaki Desk   |   2 April 2021 9:42 AM GMT
వివాహ భోజ‌నంబు లిరిక్.. వ్వాటే మ్యాన్ ఫ‌న్నీ స‌త్యా
X
ఒక క‌మెడియ‌న్ లో ప్ర‌తిభ ఎంత దాగి ఉన్నా దానిని బ‌య‌ట‌కు తీసే విధానాన్ని బ‌ట్టి.. ఎంపిక చేసిన క‌థలో కంటెంట్ ని బ‌ట్టి కూడా కొంత‌ ఉంటుంది. సిస‌లైన ప్రతిభ‌ను స‌ద్వినియోగం చేయ‌డం అన్న‌ది ద‌ర్శ‌కుడిలో ఉండే విష‌యాన్ని బ‌ట్టి కూడా ఉంటుంది. క‌థ కంటెంట్ టెక్నిక‌ల్ యాస్పెక్ట్స్ కూడా కుద‌రాలి. అవ‌న్నీ క‌లిసొస్తే ఇదిగో క‌మెడియ‌న్ స‌త్య `వ్వాటే మ్యాన్ ..` సాంగ్ త‌ర‌హాలో వ‌ర్క‌వుట‌వుతుంది.

క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న `వివాహ భోజ‌నంబు` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ స‌హా ప్ర‌తిదీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని యువ నటుడు సందీప్ కిషన్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో `వివాహ భోజనంబు` అనే రెస్టారెంట్ల చైన్ ని సందీప్ ర‌న్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెస్టారెంట్ చైన్ టైటిల్ తోనే వెంక‌టాద్రి టాకీస్ లో `వివహా భోజనంబు` సినిమాని నిర్మిస్తున్నారు. సందీప్- సినీష్ ఈ చిత్రానికి నిర్మాత‌లు. ప్రతిష్టాత్మక ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అధినేత‌.. నిర్మాత పి కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు.

స‌త్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ ఈ సినిమా పోస్ట‌ర్లు ఆక‌ట్టుకున్నాయి. తాజాగా వ్వాటే మ్యాన్ సాంగ్ ని రిలీజ్ చేయ‌గా అంత‌ర్జాలంలో వైర‌ల్ గా ఊసుకెళుతోంది. సేవింగ్స్ అంటే క్రేజీ సేవింగే చేయ‌ని స‌న్నాసి.. అండ‌ర్ వేర్ బ‌య‌ట‌కు వేసే సూప‌ర్ మేన్ అంట‌.. హోట‌ల్ బిల్ టోట‌ల్ గా క‌ట్ట‌డు అంట‌!! ఇలాంటివి మెరుపులు మెరిపించే ప‌ద‌జాలాన్ని లిరిసిస్ట్ ఉప‌యోగించారు. పాట ఆద్యంతం ఫ‌న్ ఎలివేట్ చేయ‌డంలో స‌త్య ఎక్స్ ప్రెష‌న్స్ ఎంతో అద్భుతంగా కుదిరాయి. ఈ చిత్రానికి అనిరుధ్ విజయ్ (అనీ వీ) సంగీతం అందించ‌గా.. చౌర‌స్తా రామ్ గానం ఆద్యంతం ఆకట్టుకుంది.