Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌:తొండి ఆట‌తో బాబాని తోసేసి గెలిచిన వితిక‌...

By:  Tupaki Desk   |   5 Oct 2019 6:27 AM GMT
బిగ్‌ బాస్‌:తొండి ఆట‌తో బాబాని తోసేసి గెలిచిన వితిక‌...
X
ఈ వారం బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్ లో భాగంగా బుధవారం ఎపిసోడ్ లో జరిగిన మొదటి లెవెల్లో వితికా గెలిచిన విషయం తెలిసిందే. వితికా గ్రూపు మూకుమ్మడిగా శ్రీముఖి - బాబా భాస్కర్ ని అడ్డుకోవడంలో వితికా విన్నర్ గా నిలిచింది. ఇక గురువారం జరిగిన రెండో లెవెల్లో బాబా భాస్కర్ ఒక్కడే కష్టపడి ఆడి విన్నర్ గా నిలిచాడు. ఈ ఇద్దరు శుక్రవారం ఎపిసోడ్లో బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్ ఫైనల్ రౌండ్ లో తలబడ్డారు.

ఈ రౌండ్లో భాగంగా ఇద్దరు సభ్యులు గార్డెన్ ఏరియాలో ఉన్న రిక్షాలో కూర్చోవాలి. ఎవరైతే మొదట రిక్షా నుంచి దిగుతారో వారు ఓడిపోతారు.రిక్షాలో ఉన్నవారు విన్నర్ గా నిలుస్తారు. ఈ టాస్క్ సంచాలక్ గా పునర్నవి ఉంది. గేమ్ బజర్ మ్రోగడమే ఇద్దరు సభ్యులు వెళ్ళి రిక్షాలో కూర్చున్నారు. మిగతా ఇంటి సభ్యులు వీరిని ఏదొరకంగా డిస్ట్రబ్ చేయొచ్చు. కానీ రిక్షా నుంచి లాగడం గానీ - తోయడం గానీ చేయకూడదు. దీంతో శ్రీముఖి బాబా భాస్కర్ కు లిప్ స్టిక్ రాయడం - షేవింగ్ ఫోమ్ రాయడం చేసింది. వితికాకు కూడా రాసింది.

అయితే ఇద్దరు చాలా ఓర్పుగా ఆడారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇద్దరు సభ్యులు మూడేసి స్వెట్టర్లు వేసుకోవాలని - పది మిర్చిలు తినాలని సూచించారు. బిగ్ బాస్ చెప్పిన విధంగానే వారు స్వెట్టర్లు వేసుకుని - మిర్చి తినేశారు. ఆ తర్వాత ఇద్దరికీ బాత్ రూమ్ అర్జెన్సీని గమనించి బిగ్ బాస్...ఇద్దరు స్వెట్టర్లు తీసేసి ఒక పెద్ద బాటిల్ యాప్పీఫిజ్ డ్రింక్ తాగాలని చెప్పాడు. ఇక వారు తప్పక డ్రింక్ కూడా తాగేశారు. ఈ క్రమంలోనే బాబా భాస్కర్ కు బాత్ రూమ్ బాగా ఇబ్బంది అయింది. అప్పుడే శ్రీముఖి ఓ ఐడియా ఇచ్చింది మగ సభ్యులు చుట్టూ బెడ్ షీట్లు పట్టుకుంటారని.... మీరు పని కానిచ్చేయండని చెప్పింది. దీంతో వితికాని ముందుకు జరగమని చెప్పి లేచి నిలబడ్డాడు.

ఆ సమయంలోనే వితికా తెలివితేటలు ఉపయోగించింది. నిల్చుని ఉన్న బాబాని కింద తోసేసింది. నాకు బాత్ రూమ్ ఇబ్బంది గానే ఉందని...అయినా సరే నా పక్కనే అలా చేయడం ఇష్టం లేదని - పైగా మిగతా ఇంటి సభ్యులు తోయకూడదు అని ఉంది గానీ, తాను తోయకూడదని... గేమ్‌ లో రాసి లేదుగా అందుకే బాబా భాస్కర్‌ ని తోసేశా అని చెప్పింది. ఏదైనా బిగ్ బాస్ చెబుతాడాని మాట్లాడింది. బిగ్ బాస్ కూడా బాబా ఓడిపోయినట్లు చెప్పి - వితికాని విన్నర్ గా ప్రకటించాడు. అయితే ఈ విషయం ముందే తెలిసి ఉంటే బాబా వితికానే ముందు తోసిసేవాడు కదా. బిగ్ బాస్ సీజన్2 లో కూడా ఇలాంటి టాస్క్ ఇచ్చినప్పుడు పక్కన లేడీ ఉన్న మగ సభ్యుడు కారులోనే కవర్ తీసుకుని టాయిలెట్ కి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఇలా జరిగింది. ఏదైనా బిగ్ బాస్ ఆటే వేరులే.