Begin typing your search above and press return to search.

బన్నీయే నా శాంతా క్లాజ్..ఆయన ఆటోగ్రాఫ్ నా గిఫ్ట్..ఓ బాలుడు

By:  Tupaki Desk   |   18 Dec 2020 10:45 AM GMT
బన్నీయే నా శాంతా క్లాజ్..ఆయన ఆటోగ్రాఫ్ నా గిఫ్ట్..ఓ బాలుడు
X
క్రిస్మస్ పర్వదినం అనగానే పిల్లల మదిలో మెదిలేది శాంతా క్లాజ్ రూపమే. ఆయన మోసుకొచ్చే బహుమతులు వారి కళ్లలో కోట్లాది మెరుపుల్ని పూయిస్తాయి. అయితే.. ఈ సారి తన శాంతా క్లాజ్ స్టయిలిష్ స్టార్ అల్లు అర్జునే అంటున్నాడు ఓ బాలుడు. ఆయన ఆటో గ్రాఫే తనకు క్రిస్మస్ గిఫ్ట్ అంటున్నాడు. ఇంతకీ ఎవరాా బాలుడు? ఏంటా కథ? అంటే..

క్రిస్మస్ పండుగ నేపథ్యంలో అనాథలుగా ఉన్నవారిని సంతోష పెట్టేందుకు వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు ఒక అనాథాశ్రమానికి వెళ్లారు. అక్కడ పిల్లలకు ఎలాంటి బహుమతులు కావాలంటూ ఒక వీడియో షూట్ చేశారు. అయితే.. అక్కడ ఓ బాలుడు ఆమెను ఆశ్చర్యపరిచే బహుతి అడిగాడు.

ఈ క్రిస్మస్ కు గిఫ్ట్ గా తనకు అల్లు అర్జున్ ఆటో గ్రాఫ్ కావాలని అడిగాడు. ‘సరే.. ప్రయత్నిస్తాను. నీకు ఇంకే గిఫ్టు కావాలి?’ అని అడగ్గా.. ‘అల్లు అర్జున్ ఆటోగ్రాఫే తనకు అసలైన బహుమతి’ అన్నాడు ఆ బాలుడు.

దీంతో.. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. వితికా షేరు ట్విట్టర్ లో ఆ వీడియో పోస్ట్ చేసింది. దీనికి అల్లు అర్జున్ ను ట్యాగ్ చేసింది. ‘అల్లు అర్జున్ గారు.. ఈ బాలుడు మీకు పెద్ద ఫ్యాన్. ఇతను మీ ఆటో గ్రాఫ్ ను బహుమతి కోరుతున్నాడు. ఈ క్రిస్మస్ కు మీరు ఈ బాలుడి శాంతా క్లాజ్ అవుతారా?’ అంటూ ట్వీట్ చేసింది.

ఈ విషయం అల్లు అర్జున్ కు చేరితే తప్పక ఆ బాలుడికి ‘క్రిస్మస్ కానుక’ అందుతుందనడంలో సందేహం లేదు. బాలల ఆనందం కోసం వితికా షేరు చేస్తున్న ప్రయత్నాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://twitter.com/IamVithikaSheru/status/1339536611877343238