Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: హాటు పోజిచ్చిన శ్రీమతిగారు!

By:  Tupaki Desk   |   10 July 2019 6:47 AM GMT
ఫోటో స్టొరీ: హాటు పోజిచ్చిన శ్రీమతిగారు!
X
వితిక షేరు పేరు తెలిసే ఉంటుంది. హీరో వరుణ్ సందేశ్ శ్రీమతి.. అంతే కాదు ఆమె టాలీవుడ్ హీరోయిన్. కన్నడ సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భీమవరం బ్యూటీ కొన్ని తెలుగు సినిమాల్లో మొదట చిన్న పాత్రలు చేసింది. తర్వాత హీరోయిన్ గా సెటిల్ అయింది. 'ఝుమ్మంది నాదం'.. 'భీమిలి కబడ్డీ జట్టు'.. 'పడ్డానండీ ప్రేమలో మరి' ఆమె ఫిల్మోగ్రఫీలోని సినిమాలు. అయితే వరుణ్ సందేశ్ తో ప్రేమవివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది.

ఈమధ్య బిగ్ బాస్ 3 లో ఒక కాంటెస్టెంట్ గా ఎంపిక అయిందనే వార్తలు వచ్చాయి. భర్త వరుణ్ సందేశ్ తో పాటు వితిక కూడా బిగ్ బాస్ 3 హౌస్ మేట్స్ గా ఉండబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా అధికారికంగా ప్రకటన రావల్సి ఉంది. దాని సంగతేమో కానీ తాజాగా వితిక ఒక హాట్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వా షేర్ చేసింది. ఈ ఫోటోలలో నిలువు స్ట్రైప్స్ ఉండే ఒక బ్లేజర్ ధరించి పోజిచ్చింది. అయితే వీ నెక్ ఉండే ఇన్నర్ ధరించడంతో ఆటోమెటిక్ గా ఫోటో స్పైసీగా మారిపోయింది. రెండు జడలు వేసుకొని ఆ జడలను పట్టుకొని మరీ పోజిచ్చింది. బ్లేజర్ పాకెట్ లో తెల్లటి పువ్వును కూడా పెట్టుకుంది. ఏదేమైనా మన తెలుగు హీరోయిన్ శ్రీమతి అయిన తర్వాత స్పైసీ ఫోటోషూట్లు చేయడం సంచలనమే.

అందుకే సర్ ప్రైజ్ అయిన నెటిజన్లు "సో హాట్ సో బ్యూటిఫుల్".. "భీమవరం ఫ్యాషన్ ఐకాన్".. "BB3 లో నిన్ను చూడాలని ఉంది" అంటూ కామెంట్లు పెట్టారు. మరి నిజంగానే బిగ్ బాస్ 3 లో కనిపిస్తుందా లేక సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఇదంతా నెట్ ప్రాక్టీసా అనేది త్వరలోనే క్లారిటీ వస్తుంది లెండి.