Begin typing your search above and press return to search.

వ‌రుణ్‌ సందేశ్ భార్య మ‌ళ్లీ...

By:  Tupaki Desk   |   15 July 2017 9:31 AM GMT
వ‌రుణ్‌ సందేశ్ భార్య మ‌ళ్లీ...
X
ఆత్మ‌హత్యాయ‌త్నం ప్ర‌చారం నేప‌థ్యంలో వ‌రుణ్ సందేశ్ భార్య వితిక శేరు వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. మీడియాలోనూ, సోష‌ల్ మీడియాలోనూ ఎక్క‌డ చూసినా ఆమె గురించే చ‌ర్చ‌. కానీ భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ కూడా స్పందించి తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నామ‌ని, ఆత్మ‌హ‌త్యాయ‌త్నం ఒట్టి పుకారే అని తేల్చి చెప్ప‌డంతో అప్ప‌టిదాకా సాగిన ప్ర‌చారానికి పుల్‌స్టాప్ ప‌డిన‌ట్టైంది. అయితే తాజాగా మ‌రోసారి వితిక శేరు వార్త‌ల్లోకెక్కారు.

ఈసారి ఎందుకో తెలుసా? త‌న కురుల‌ని దానం చేసినందుకు! క్యాన్స‌ర్ బాధితుల కోసమ‌ని తాను ఎంతో మురిపెంగా పెంచుకొన్న కురుల‌ని దానం చేసింది వితిక‌. ఒక‌ప్పుడు హీరోయిన్ అయిన వితిక పెళ్లి త‌ర్వాత సినిమాలు మానేశారు. అయితే ఇప్ప‌టికీ ఎంతో అందంగా క‌నిపించే ఆమె త‌న కురుల్ని దానం చేసి వార్త‌ల్లోకెక్కారు. త‌న కురుల్ని క‌ట్ చేయించుకొన్న‌ప్ప‌టి వీడియోని సోష‌ల్ నెట్వ‌ర్కింగ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇవ్వ‌డంలో ఎంతో సంతోషం ఉంటుంద‌ని ఈ సంద‌ర్భంగా ఆమె త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. డ‌బ్బో , వ‌స్తువులో కాకుండా త‌మ అందాన్ని రెట్టింపు చేసే కురులనిదానం చేసిన వితిక విశాల హృద‌యాన్ని మ‌నం అప్రిషియేట్ చేయాల్సిందే...