Begin typing your search above and press return to search.

బిగ్‌బాస్ 5 లీక్ : ఈ వారం ఎలిమినేట్‌ కండల వీరుడు

By:  Tupaki Desk   |   7 Nov 2021 7:31 AM GMT
బిగ్‌బాస్ 5 లీక్ : ఈ వారం ఎలిమినేట్‌ కండల వీరుడు
X
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 నుండి మరో వికెట్ పడింది. ఆదివారం ఎపిసోడ్ లో విశ్వ ఎలిమినేట్‌ అవ్వబోతున్నాడు. ఎప్పటిలాగే ముందే ఎలిమినేషన్ కు సంబంధించిన విషయం లీక్ అయ్యింది. కెప్టెన్‌ షన్నూ ఇంకా ఆనీ మరియు మానస్‌ లు కాకుండా ఇంటి సభ్యులు అంతా కూడా నామినేట్‌ అయ్యారు. వారిలో విశ్వ మరియు జెస్సీలు మాత్రమే వీక్‌ అంటూ అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఇద్దరిలో ఒకరు వీక్‌ అయ్యారు. జెస్సీకి షన్నూ స్నేహితుల సపోర్ట్ కాస్త గట్టిగానే ఉండటంతో సేవ్‌ అయ్యాడు. ఈ వారంలో షన్నూ నామినేట్‌ అవ్వలేదు. దాంతో షన్నూ ఓట్లు అన్ని కూడా జెస్సీకి పడి ఉంటాయి అంటున్నారు. అందుకే షన్నూ స్నేహితుడు అయిన జెస్సీ సేవ్‌ అయ్యి విశ్వ ఎలిమినేట్‌ అయ్యాడు.

బిగ్‌ బాస్ నుండి ఇప్పటికే సరయు.. ఉమా దేవి.. లహరి.. హమీదా.. శ్వేత వర్మ.. నటరాజ్ మాస్టర్‌.. ప్రియా.. లోబో లు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు కండల వీరుడుగా పేరున్న విశ్వ కూడా బయటకు వెళ్లి పోయాడు. విశ్వ మంచి ఫిజిక్ తో ఫిజికల్ టాస్క్ లో ది బెస్ట్ అని పలు సందర్బాల్లో నిరూపితం అయ్యింది. కాని అతడికి బయట అభిమానులు పెద్దగా లేరు. గేమ్‌ లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా అతడు సొంత అభిమానులను దక్కించుకోవడంల సఫలం కాలేక పోయాడు. రవి వెంట మరియు ఇతర కంటెస్టెంట్స్ వెంట ఎక్కువగా ఉండటంతో పాటు చిన్న విషయాలకు కూడా గొడవలు పడటం వంటి కారణాల వల్ల విశ్వ ఈ వారం ఎలిమినేట్‌ అయ్యాడు అంటూ బుల్లి తెర వర్గాల వారు మరియు బిగ్ బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విశ్వ వెళ్లి పోయిన తర్వాత ఇంట్లో మిగిలిన వారు షన్నూ.. సిరి.. రవి.. కాజల్.. మానస్‌.. ప్రియాంక.. సన్నీ.. ఆనీ.. జెస్సీ.. శ్రీరామ చంద్రలు ఉన్నారు. మొత్తం 19 మంది హౌస్‌ లో అడుగు పెట్టగా 9 మంది ఎలిమినేట్‌ అయ్యారు ఇంకా పది మంది ఉన్నారు. ఉన్న పది మందిలో ఆనీ మరియు ప్రియాంకలు కాస్త వీక్ గా కనిపిస్తున్నారు. మిగిలిన అంతా కూడా టాప్ 5కు పూర్తి అర్హత ఉన్న వారిగానే అనిపిస్తున్నారు. కనుక ముందు ముందు ఎపిసోడ్స్ చాలా కాంప్లికేటెడ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి... ఎవరు ఎలిమినేట్‌ అయినా కూడా ఖచ్చితంగా అది సంచలనం అనడంలో సందేహం లేదు. బిగ్‌ బాస్ హౌస్ నుండి వరుసగా వీక్ అనుకున్న వాళ్లే ఎలిమినేట్‌ అవుతున్నారు. ఇంతకు ముందు స్ట్రాంగ్ అనుకున్న వారు కూడా ఎలిమినేట్‌ అవ్వడం జరిగింది. కాని ఈసారి మాత్రం షో ఎలిమినేషన్ ఓట్ల ప్రకారం జరుగుతున్నట్లుగా అనిపిస్తుందని నెటిజన్స్ అంటున్నారు.