Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: విశ్వరూపం2లో డోస్ ఎక్కువే

By:  Tupaki Desk   |   11 Jun 2018 6:02 PM IST
ట్రైలర్ టాక్: విశ్వరూపం2లో డోస్ ఎక్కువే
X

ఎంతో కాలంగా కమల్ అభిమానులు ఎదురుచూస్తున్న మూవీ విశ్వరూపం2. ఇక ఆగిపోయిందని అంతా అనుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు థియేటర్లలోకి వస్తోంది. తెలుగు వెర్షన్ ట్రైలర్ ను ఎన్టీఆర్ తో లాంఛ్ చేయించిన మూవీ యూనిట్.. కాసింత ఆలస్యం అయినా.. జనాలకు చెప్పిన రోజునే ట్రైలర్ ఇవ్వగలిగింది.

విశ్వరూపం కు కొనసాగింపుగానే ఈ సినిమా ఉంటుందని గతంలోనే చెప్పిన కమల్ హాసన్.. అందుకు తగినట్లుగానే ట్రైలర్ ను కట్ చేశారు. గట్స్ ఉన్న యాక్టర్ సినిమాలో నటించడమే కాదు.. తనే రచించి మరీ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందనే సంగతి చూపించారు కమల్. విశ్వరూపం2 ట్రైలర్ లో అన్నీ ఉన్నాయి. యాక్షన్ మోడ్ తో పాటు ఆండ్రియాతో కమల్ హాసన్ డీప్ రొమాన్స్.. అండర్ వాటర్ సీన్స్.. నటనలో తన ప్రతిభ అన్నీ చూపించేశారు కమల్.

అయితే.. సుదీర్ఘమైన ట్రైలర్ లో అనేక సన్నివేశాలు ఉన్నా.. అన్నిటికంటే ఎక్కువ సమయం యాక్షన్ సీన్స్ కే కేటాయించారు. ఇంత వయసులో కూడా కమల్ ఇంతటి యాక్షన్ సీన్స్ ను చేయగలగడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే.. మరీ అసలు సన్నివేశాలేమీ చూపించకుండా.. మరీ ఇంతగా ఫైటింగ్ సీక్వెన్స్ లు.. యాక్షన్ కొరియోగ్రఫీతో ట్రైలర్ ను నింపేయడం మాత్రం ఆలోచించాల్సిన విషయమే. ఆగస్ట్ 10న విశ్వరూపం2 థియేటర్లలోకి వస్తుందంటూ.. ట్రైలర్ ద్వారా చెప్పారు కమల్ హాసన్.