Begin typing your search above and press return to search.

'మాస్ కా దాస్'కి హిట్టు దొరికేనా...?

By:  Tupaki Desk   |   14 Jun 2020 11:00 PM IST
మాస్ కా దాస్కి హిట్టు దొరికేనా...?
X
టాలీవుడ్ లో సినిమాలతో కంటే తన యాటిట్యూడ్ తో వివాదాస్పద వ్యాఖ్యలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. 'పిట్టకథ' అనే షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసిన విశ్వక్ 'వెళ్ళిపోమాకే' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అయితే ఈ సినిమా వచ్చిందని ప్రేక్షకులకు తెలిసేలోపే వెళ్లిపోయింది. ఆ తర్వాత 'ఈ నగరానికి ఏమైంది' 'ఫలక్ నుమా దాస్' చిత్రాలతో యూత్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో హీరో నాని ప్రొడ్యూసర్ గా విశ్వక్ తో 'హిట్' అనే సినిమా రూపొందించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ 'హిట్' యాక్టర్ గా విశ్వక్ సేన్ కి మంచి పేరునే తెచ్చిపెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. దీంతో 'హిట్' సినిమా హిట్ కి ప్లాపుకి మధ్యలో నిలిచిపోయింది. అయితే ఈ సినిమా బుల్లితెరపై ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో తన హవా చూపించింది. దీంతో ఓటీటీ రిలీజ్ కైనా పనికొస్తుందని 'హిట్ 2' ఓకే చేసాడు విశ్వక్ సేన్.

అంతేకాకుండా 'పాగల్' అనే మరో సినిమా కూడా స్టార్ట్ చేసాడు. ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ న‌రేష్ కొప్పల్లి ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా లక్కీ మీడియా బ్యానర్ లో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ గత సినిమా 'హిట్' కు ఫోటోగ్రఫీ అందించిన మణికందన్ ఈ సినిమాకు పని చేస్తుండగా.. 'గూఢచారి' గ్యారీ సర్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఇక 'అర్జున్ రెడ్డి' రథన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా స్టోరీ 'పాగల్' టైటిల్ కి తగ్గట్టే పిచ్చి పిచ్చి గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. ఈ 'పాగల్' సినిమాలో హీరో పాత్ర ఏకంగా 9 మందిని లవ్ చేస్తుందట. ఆల్రెడీ ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన 'ఆరెంజ్' లాంటి సినిమాలు అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. మరి ఇదే నేపథ్యంలో వస్తున్న 'పాగల్' ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'మాస్ కా దాస్' అని పిలిపించుకుంటున్న విశ్వక్ సేన్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే 'హిట్ 2' 'పాగల్' ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.