Begin typing your search above and press return to search.
కుర్ర హీరో పెద్ద సాహసం
By: Tupaki Desk | 25 Dec 2018 10:23 PM ISTదర్శకులు నటులవడం.. నటులు దర్శకులుగా మారడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. యువ నటుడు విశ్వక్సేన్.. రెండో జాబితాలో చేరిపోయాడు. ‘వెళ్ళిపోమాకే’ అనే విభిన్నమైన సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడతను. ఆ తర్వాత ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ తీసిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో నటించాడు. ఇందులో అతడి స్క్రీన్ ప్రెజెన్స్.. నటన ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత అతను దర్శకుడిగా అరంగేట్రం చేస్తుండటం విశేషం. తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ‘ఫలక్ నుమా దాస్’ అనే సినిమా చేస్తుండటం విశేషం. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు. ఇది చూస్తే సినిమా మీద మంచి ఫీలింగే కలుగుతోంది.
పాత బస్తీ.. ఛార్మినార్ నేపథ్యంలో సాగే రా కామెడీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తోంది మోషన్ పోస్టర్ చూస్తే. పూర్తిగా ఆ ప్రాంతాల్లోనే సినిమా తీసినట్లున్నారు. ఇక్కడి రా నెస్ హైలైట్ చేస్తూ ‘అంగ్రేజ్’.. ‘హైదరాబాద్ నవాబ్స్’ లాంటి మంచి కామెడీ సినిమాలు వచ్చాయి. ఆ ఫ్లేవర్ ను తర్వాత ఇంకొందరు ఉపయోగించుకున్నారు. విశ్వక్సేన్ కూడా అదే స్టయిల్లో సినిమా తీసినట్లున్నాడు. ఈ మధ్య హైదరాబాద్ అర్బన్ ఫ్లేవర్లో వచ్చే సినిమాలు జనాల్ని బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాయి. మరి ‘ఫలక్ నుమా దాస్’ కూడా ఆ కోవలోకే చేరుతుందేమో చూడాలి. సినిమా తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కినట్లుంది. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ సైతం ఓ కీలక పాత్ర చేస్తుండటం విశేషం. మిగతా నటీనటులందరూ కొత్తవాళ్లలాగే కనిపిస్తున్నారు.