Begin typing your search above and press return to search.

గొడవలు.. కొట్లాటలు లేవు.. మొదటిసారి ప్రశాంతంగా సినిమా రిలీజ్ అవుతుంది..!

By:  Tupaki Desk   |   20 Oct 2022 4:19 AM GMT
గొడవలు.. కొట్లాటలు లేవు.. మొదటిసారి ప్రశాంతంగా సినిమా రిలీజ్ అవుతుంది..!
X
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తమిళంలో సూపర్ హిట్టైన ఓ మై కడవులే మూవీకి అఫీషియల్ రీమేక్ గా ఓరి దేవుడా తెరకెక్కింది. మాత్రుక దర్శకుడు అశ్వత్ మరిముత్తునే తెలుగు రీమేక్ ని డైరెక్ట్ చేశారు. యువ హీరోల్లో సరికొత్త సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు విశ్వక్ సేన్. అతని సినిమా రిలీజ్ అంటే ప్రమోషన్స్ లో హడావిడి తెలిసిందే. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ లో గొడవలు కామనే. సినిమాని ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయాలని రకరకాల ప్రయత్నాల్లో ప్రమోషన్స్ చేస్తాడు విశ్వక్ సేన్.

ఈ క్రమంలో ఎక్కడో ఒక చోట డిస్కషన్స్ కి చోటు ఇస్తాడు. ఒక్క సినిమా అని కాదు విశ్వక్ ప్రతి సినిమా రిలీజ్ ముందు ఏదో ఒక గొడవ, కొట్లాట ఉండాల్సిందే. అయితే అలాంటివి ఏమి జరగకుండా రిలీజ్ అవుతున్న సినిమా ఓరి దేవుడా అని చెప్పొచ్చు. ఇదే విషయాన్ని ఓరి దేవుడా దీవాళి దావత్ స్పెషల్ ఈవెంట్ లో చెప్పాడు విశ్వక్ సేన్. ఈసారి తన సినిమా ఇంత ప్రశాంతంగా రిలీజ్ అవుతున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.

సినిమా షూటింగ్ టైం లో తన సిస్టర్ కి ఆరోగ్యం బాగాలేదని. ఆ టైం లో తనకు చాలా బాధ కలిగిందని అన్నారు విశ్వక్ సేన్. ఇప్పుడు తన సినిమా ఈవెంట్ లో అక్క కూడా ఉండటం సంతోషంగా ఉందని అన్నారు విశ్వక్ సేన్. మనకు లైఫ్ లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే ఫ్యామిలీ ముందు అని వాళ్లకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అన్నారు.

తను చెప్పాలనుకునే మాటని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే వారిలో విశ్వక్ సేన్ ఒకరు. అందుకే గొడవల్లేకుండా సినిమా రిలీజ్ అవుతుంది అని కామెంట్ చెప్పడం కూడా ఆ కోణంలోనే అనుకోవచ్చు. తన కోసం వచ్చిన హీరోలందరికి చాలా పెద్ద థ్యాంక్స్ అని చెప్పాడు విశ్వక్ సేన్.

సినిమా ప్రమోషన్స్ లో భాగమైన రాం చరణ్ కి తన స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు విశ్వక్ సేన్. రాం చరణ్ తనని అంత క్లీన్ గా అబ్సర్వ్ చేస్తారని తాను అసలు ఊహించలేదని విశ్వక్ సేన్ అన్నారు.

సినిమాలో విక్టరీ వెంకటేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నా.. ఆరేడు సినిమాలకే వెంకటేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం లక్కీగా అనిపించింది. ఇప్పటికీ ఆయన డెడికేషన్ చూసి షాక్ అయ్యానని అన్నారు విశ్వక్ సేన్. రాం చరణ్ చెప్పినట్టుగా ఓరి దేవుడాతో దీపావళి వస్తుందో.. దీపావళికి ఓరి దేవుడా కొత్త జోష్ తెస్తుందో చూద్దామాని అన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.