Begin typing your search above and press return to search.

విశ్వక్ సేన్ Vs యాంకర్ దేవి.. మధ్యలో అనసూయ..!

By:  Tupaki Desk   |   5 May 2022 11:32 AM GMT
విశ్వక్ సేన్ Vs యాంకర్ దేవి.. మధ్యలో అనసూయ..!
X
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ వెర్సెస్ టీవీ యాంకర్ దేవీ నాగవల్లి వివాదం ఇప్పుడు మీడియా - సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. 'అశోకవనంలో అర్జున కల్యాణం' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ ఓ ప్రాంక్ వీడియో చేయడం.. పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్న పాగల్ సేన్ అంటూ దీనిపై ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ పెట్టడంతో ఈ వివాదం మొదలైంది.

లైవ్ డిబేట్ లో 'పాగల్ సేన్' 'డిప్రెస్డ్ మ్యాన్' అంటూ తనని వ్యక్తిగతంగా ఎటాక్ చేస్తున్న యాంకర్ పై విశ్వక్ ఆగ్రహం వ్యక్తం చేయడం.. యాంకర్ దేవి అతన్ని 'గెటౌట్' అంటూ షో నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేయడం.. దీంతో విశ్వక్ నోటికి పనిచెప్పు 'F' అనే పదాన్ని వాడటం.. 'వెధవ.. గెటవుట్' అంటూ యాంకర్ మళ్లీ గట్టి గట్టిగా అరవడం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అయితే ఇందులో ఎవరిది తప్పు అనే విషయంలో పలు రకాల వాదనలు వినిపిస్తున్నా.. ఎక్కువ శాతం విశ్వక్ సేన్ కే మద్దతు లభిస్తోందని సోషల్ మీడియా చూస్తే అర్థం అవుతుంది. టీవీ స్టుడియోలో అవమానం ఎదుర్కొన్న హీరోకి సపోర్ట్ గా నిలిస్తూ.. న్యూస్ ఛానల్ మరియు షో నిర్వహించిన యాంకర్ పై విరుచుకుపడుతున్నారు.

సినీ ఇండస్ట్రీ వైపు నుంచి కూడా విశ్వక్ సేన్ కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. కమెడియన్ రాహుల్ రామకృష్ణ - సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ - నటి కరాటే కళ్యాణి - దర్శకుడు బండి సంజయ్ కుమార్ - బాబు గోగినేని - డైరెక్టర్ హరీష్ శంకర్.. ఇలా కొంతమంది సెలబ్రిటీలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో హీరోకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అనూహ్యంగా తెర పైకి యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ను తీసుకొచ్చారు.

సినీ నటి కరాటే కళ్యాణి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెడుతూ "3*3 tv వర్సెస్ సేన్ లో పూర్తిగా టీవీ వాళ్లదే తప్పు. నేను హీరోకే సపోర్ట్ చేస్తా. అనసూయ అన్నిసార్లు F** పదం వాడినప్పుడు.. నువ్వు రోడ్డు మీద డాన్స్ చేసినప్పుడు ఏమైంది అమ్మ?" అంటూ సెటైర్ వేసింది. బాబు గోగినేని కూడా విశ్వక్ కి మద్దతు ప్రకటిస్తూ.. గతంలో అనసూయ F** అనే పదాన్ని వాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

'అర్జున్ రెడ్డి' సినిమా అప్పుడు అనసూయ మీడియాకి ఎక్కి తెగ హడావిడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీవీ9 చానల్ 'అర్జున్ రెడ్డి vs అనసూయ' అని ఓ డిబేట్ పెట్టింది. దీనికి యాంకర్ దేవీ నాగవల్లి హోస్ట్ అయితే.. యాంకర్ అనసూయ గెస్ట్. ఇందులో అనసూయ F***ing అంటూ బూతులు మాట్లాడింది.

దేవీ దీనిపై అభ్యంతరం చెప్పకపోగా.. ఆ బూతు మాట్లాడిన అనసూయలో ఫైటర్ కనిపిస్తున్నారంటూ కొనియాడింది. కానీ ఇప్పుడు విశ్వక్ అదే పదాన్ని వాడినందుకు జెండర్ కార్డ్ ఉపయోగిస్తూ రచ్చ చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ ఇష్యూలో ఎంటర్ అవడమే కాదు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే యాంకర్ అనసూయ ని కూడా లాగారు.

యాంకర్ దేవీ డిబేట్ లో అనసూయ F పదాన్ని వాడిన వీడియోని షేర్ చేస్తూ 'అరెరే.. భలే దొరికిందే ఈ వీడియో.. దేవి స్నేక్ వల్లి అక్కకి ఈ పదం బ్రహ్మానందంగా కామెడీ సీన్ లా అనిపించి అక్కలో హాస్య గ్రంధులు విచ్చుకునట్టు ఉన్నాయే. అందుకే ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంది.. మళ్లీ అక్కకి ఇక్కడ ఫైటర్ అనసూయ కనిపించింది. అంతేనా అక్కా??' అంటూ ఓ ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ పెట్టారు. హరీష్ శంకర్ స్మైల్ ఎమోజీలతో ఆ పోస్ట్ ని షేర్ చేశారు.

అంతేకాదు యాంకర్ రజినీకాంత్.. విశ్వక్ సేన్ ని బుడ్డ హీరో అని సంభోదించడాన్ని నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ వీడియోని సైతం హరీష్ ఫేస్ బుక్ లో షేర్ చేశారు. అలానే విశ్వక్ సేన్ సదరు న్యూస్ ఛానల్ ను యాంకర్ ను ఆడుకున్నాడు అంటూ ఓ మీమ్ పేజ్ ఎడిట్ చేసిన వీడియోని కూడా దర్శకుడు షేర్ చేయడం గమనార్హం.

విశ్వక్ సేన్ vs యాంకర్ దేవీ వివాదం మొత్తం 'ఎఫ్' పదం చుట్టూనే నడుస్తోంది. ఎవరైనా సరే ఓ మహిళ పై అలాంటి పదాన్ని ఉపయోగించడం ఖచ్చితంగా తప్పే. అందుకే తన తప్పు తెలుసుకొని విశ్వక్ క్షమాపణ చెప్పాడు. దెబ్బ తగిలినప్పుడు అమ్మా అని ఎలా అంటామో.. అది అలాగే వచ్చేసింది తప్పితే.. వేరే ఉద్దేశం లేదంటూ వివరణ ఇచ్చారు.

అదే సమయంలో గెస్ట్ గా ఓ హీరోని స్టుడియోకి పిలిచి అవమానకర రీతిలో గెటౌట్ అని అరిచి మరీ పంపేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. అతను మాట జారినా.. ఒక మీడియా ప్రతినిధిగా పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకురావాల్సింది పోయి.. 'వెధవ.. గెట్ ఔట్' అని ఆగ్రహం వ్యక్తం చేయడం మంచి జర్నలిజం అనిపించుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. అదే ఓ స్టార్ హీరోనోలేదా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోనో అయితే ఇలాగే 'పాగల్ సేన్' 'డిప్రెస్డ్ పర్సన్' అని వ్యాఖ్యానిస్తారా? అని అంటున్నారు.