Begin typing your search above and press return to search.

లవ్ యూ అంటే రాఖీ కట్టింది: హీరో విశ్వక్ సేన్

By:  Tupaki Desk   |   1 April 2020 2:40 PM IST
లవ్ యూ అంటే రాఖీ కట్టింది: హీరో విశ్వక్ సేన్
X
టాలీవుడ్ లో యంగ్ హీరోల హవా ఈ మధ్య మాములుగా లేదు. అందులో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఈ నగరానికి ఏమైంది సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సొంతంగా డైరెక్షన్ చేసి 'ఫలక్ నుమా దాస్' సినిమాను రూపొందించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయి విశ్వక్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. పక్కా హైదరాబాద్ యాసలో తీసిన ఫలక్ నుమా దాస్ సినిమాతో తనని తను నిరూపించుకున్న విశ్వక్ కి కొత్త సినిమాల ఆఫర్లు క్యూ కట్టాయి. "నన్నెవడు లేపే అవసరం లేదు.. నన్ను నేను లేపుకుంటా" అనే సంచలనమైన వ్యాఖ్యలతో యూత్ ని తనవైపు తిప్పుకున్న విశ్వక్. రీసెంట్ గా కొత్త డైరెక్టర్ శైలేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'హిట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టడంతో విశ్వక్ తదుపరి సినిమా ఏంటా.. అని అభిమానులలో చర్చలు మొదలయ్యాయి.

ఇదిలా ఉండగా విశ్వక్ ఇటీవలే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హోస్ట్ గా నిర్వహిస్తున్న 'మీకు మాత్రమే చెప్తా' అనే టీవీ షోలో పాల్గొన్నాడు. ఆ షోలో తరుణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ.. మధ్యలో తన చిన్నప్పటి ఫస్ట్ లవ్ గురించి చెప్పాడు. విశ్వక్ 8వ తరగతి లో ఉన్నప్పుడు 10వ తరగతి అమ్మాయిని లవ్ చేసాడట. ఒకరోజు ఆ అమ్మాయికి ప్రొపోజ్ చేయడంతో విషయం టీచర్ వరకు చేరిందట. టీచర్ ఇద్దరినీ పిలిచి ఆ అమ్మాయితో విశ్వక్ కి రాఖీ కట్టించిందట. ఈ విషయం పై విశ్వక్ స్పందిస్తూ ఈ లవ్ మేటర్ బయటికి రావొద్దు అనుకున్న కానీ నీ వల్ల బయటపడిందని నవ్వుతూ బదులిచ్చాడు. అప్పుడంటే స్కూల్ పిల్లాడు కాబట్టి రాఖీ కట్టారు కానీ ఇప్పుడు విశ్వక్ కోసం చాలామంది అమ్మాయిలు సిద్దంగా ఉన్నారని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.