Begin typing your search above and press return to search.
తమిళ సూపర్ హిట్ రీమేక్ ని స్టార్ట్ చేసిన విశ్వక్ సేన్..!
By: Tupaki Desk | 28 Dec 2020 12:00 PM ISTతమిళ్ లో సూపర్ హిట్ అయిన 'ఓ మై కడవులే' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో అశోక్ సెల్వన్ - రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించాడు. 2019లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం అభినందించారు. దీంతో ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని భావించిన ప్రముఖ నిర్మాత పీవీపీ.. రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. పీవీపీ సినిమాస్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు కలిసి తెలుగు రీమేక్ ని నిర్మించనున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
'ఈ నగరానికి ఏమైంది' 'ఫలక్ నుమా దాస్' 'హిట్' వంటి సినిమాలతో జోష్ మీదున్న విశ్వక్ సేన్ 'ఓ మై కడవులే' తెలుగు రీమేక్ లో హీరోగా నటించనున్నాడు. మాతృకను డైరెక్ట్ చేసిన అశ్వత్ మరిముత్తు తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి సంభాషణలు అందిస్తారని సమాచారం. ఇప్పటికే 'పాగల్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విశ్వక్ సేన్.. 2021 ఫిబ్రవరిలో ఈ రీమేక్ చిత్ర రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. రెండు పెద్ద నిర్మాతలు కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో నటిస్తున్న విశ్వక్ సేన్ ని కెరీర్ కి ఈ సినిమా ప్లస్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.