Begin typing your search above and press return to search.

దాసూకి రొమాంటిక్ కామెడీ సూట‌వుద్దా?

By:  Tupaki Desk   |   13 Sep 2019 5:43 AM GMT
దాసూకి రొమాంటిక్ కామెడీ సూట‌వుద్దా?
X
బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా.. విక్కీ కౌశ‌ల్.. కార్తీక్ ఆర్య‌న్ లాంటి ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేని స్టార్లు ఇప్పుడిప్పుడే లైమ్ లైట్ లోకి వ‌చ్చి వెలుగులు విర‌జిమ్ముతున్నారు. ఆయుష్మాన్ - విక్కీ- కార్తీక్ ఇప్ప‌టికే హీరోలుగా నిరూపించుకున్నారు. వీళ్లంతా ఓ ప్ర‌త్యేక‌మైన జోన‌ర్ లో ఎంతో అభిరుచి ఉన్న కథ‌ల్ని ఎంచుకుంటూ ప‌ది మందికీ ఆద‌ర్శంగా నిలుస్తుండ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే వీళ్ల అభిరుచి టాలీవుడ్ యువ‌ హీరోల‌కు ఆద‌ర్శం కానుంద‌ని తాజా ప్ర‌య‌త్నాలు చెబుతున్నాయి.

బాలీవుడ్ లో హిట్ట‌యిన సినిమాల్ని వెంట‌నే ఖాతాలోకి మ‌ళ్లించే మ‌న అగ్ర నిర్మాత‌లు రీమేక్ హ‌క్కుల్ని చేజిక్కించుకుని మ‌న కుర్ర హీరోల‌తో తీస్తున్నారు. అలా ఇప్ప‌టికే ప‌లువురు బ‌డా నిర్మాత‌లు ఆ త‌ర‌హా ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. రాజ్ త‌రుణ్ హీరోగా ఆయుష్మాన్ న‌టించిన `డ్రీమ్ గాళ్` చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే బాట‌లో ఇప్పుడు ఫ‌ల‌క్ నుమా దాస్ ఫేం విశ్వ‌క్ సేన్ కూడా వెళుతున్నార‌ని తెలుస్తోంది.

హీరో కం నిర్మాత దాసూ తెలివితేట‌లేంటో తొలి ప్ర‌య‌త్న‌మే తెలిసొచ్చింది ఆడియెన్ కి. మ‌ల‌యాళం క‌ల్ట్ క్రైమ్ డ్రామా `అంగామ‌ళై డైరీస్` కి రీమేక్ అయినా హైద‌రాబాదీ భాష‌- యాస‌తో ఆక‌ర్షించ‌డంలో విశ్వ‌క్ పెద్ద స‌క్సెస‌య్యాడు. సినిమా జ‌యాప‌జ‌యాల మాట అటుంచితే అత‌డి ప‌బ్లిసిటీ స్టంట్ అంతే ఇదిగా మీడియా అటెన్ష‌న్ ని గ్రాబ్ చేసింది. తాజాగా దాసూ మ‌రోసారి రీమేక్ లోనే న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఇప్ప‌టికే బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ `సోను కి టుటు కి స్వీటీ` రీమేక్ హ‌క్కుల్ని చేజిక్కించుకున్నారు. హిందీలో కార్తీక్ ఆర్య‌న్ పోషించిన పాత్ర‌ను తెలుగు వెర్ష‌న్ లో విశ్వ‌క్ పోషిస్తార‌ట‌. రొమాంటిక్ కామెడీ ల‌వ్ స్టోరీకి ప‌క్కా హైద‌రాబాదీ మాస్ కుర్రాడు ఎంత‌వ‌ర‌కూ సూట‌బుల్ అన్న‌ది వేచి చూడాల్సిందే. హిందీ వెర్ష‌న్ కి లవ్ రాంజ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. తెలుగు వెర్ష‌న్ కి ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు అన్న‌ది తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.