Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో డైరెక్షన్‌ లో విశ్వక్ సేన్‌

By:  Tupaki Desk   |   18 May 2022 12:30 PM GMT
స్టార్‌ హీరో డైరెక్షన్‌ లో విశ్వక్ సేన్‌
X
యంగ్‌ హీరో విశ్వక్ సేన్ ఆ మద్య ఒక వివాదం కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. మళ్లీ ఇటీవల అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కాస్త హడావిడి చేసి వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే.

విశ్వక్‌ సేన్ హీరోగా వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రతి సినిమాకు విభిన్నమైన పాత్రల్లో విశ్వక్ సేన్ కనిపిస్తున్నాడు.

విశ్వక్ సేన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సమయంలోనే యాక్షన్ కింగ్‌.. కన్నడ స్టార్‌ హీరో అర్జున్‌ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఒక సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. కన్నడం లో స్టార్‌ హీరో అయినా కూడా అర్జున్‌ కు తెలుగు నాట మంచి గుర్తింపు ఉంది. ఆయన దర్శకత్వంలో ఒక మల్టీ లాంగ్వేజ్ మూవీ తెరకెక్కబోతుంది.

ఇటీవలే స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి అయ్యింది. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించడం కోసం అర్జున్ ప్రయత్నాలు చేస్తుండగా విశ్వక్ సేన్ అయితే ఆ కథకు బాగుంటాడని ఆయన భావించాడట. విశ్వక్ సేన్ కూడా స్క్రిప్ట్‌ నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ దర్శకత్వంలో సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందంటున్నారు.

హీరోగా విశ్వక్‌ సేన్‌ నటించబోతున్న ఆ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్‌ హీరోయిన్ గా నటించబోతుందట. తెలుగు తో పాటు తమిళం మరియు కన్నడంలో కూడా సినిమాను రూపొందిస్తారని తెలుస్తోంది. ఈమద్య కాలంలో ఇతర భాషల స్టార్స్ మరియు దర్శకులు తెలుగు లో సినిమాలు చేస్తూ ఇక్కడ నుండి పాన్ ఇండియాకు వెళ్లాలి అనుకుంటున్నారు.

తమిళ దర్శకులు శంకర్‌.. లింగు స్వామి తో పాటు మరి కొందరు కూడా తెలుగు లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అర్జున్‌ వంతు వచ్చింది. తెలుగు లో యంగ్‌ హీరోలు పాన్ ఇండియా సినిమాలను.. మల్టీ లాంగ్వేజ్ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విశ్వక్ సేన్ కూడా ఈ సినిమా తో మరో భాషలో అడుగు పెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.