Begin typing your search above and press return to search.

2020 గిఫ్ట్: వాల్ పోస్ట‌ర్ HIT తొలి గ్లింప్స్

By:  Tupaki Desk   |   25 Dec 2019 6:01 AM GMT
2020 గిఫ్ట్: వాల్ పోస్ట‌ర్ HIT తొలి గ్లింప్స్
X
ఈ న‌గ‌రానికి ఏమైంది? .. `ఫ‌ల‌క్ నుమా దాస్` చిత్రాల‌తో విశ్వ‌క్ సేన్ పేరు తెలుగు ఫిలింస‌ర్కిల్స్ లో పాపుల‌రైంది. దాసులోని గ్రేసు అంద‌రికీ న‌చ్చింది. ఫ‌క్తు నైజాం యాస‌తో మాస్ ఆహార్యంతో దాసు ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్ ఫాలోయింగ్ ని తెచ్చింది. నైజాంలో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ర్వాత దాసుకే అంత సీనుంటుందా? అన్న చ‌ర్చా సాగింది. దుర‌దృష్ఠ‌వ‌శాత్తూ ఫ‌ల‌క్ నుమా దాస్ ఫ్లాప్ అయ్యిందే కానీ.. లేదంటేనా!

ఏదైతేనేం.. ఇప్పుడు దాసులోని ప్రతిభ‌కు నానీ రూపంలో మ‌రో ఛాన్స్ ద‌క్కింది. నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా ప‌తాకంపై విశ్వ‌క్ హీరోగా `హిట్-ది ఫ‌స్ట్ కేస్` ప్ర‌స్తుతం సెట్స్ పై ఉంది. క్రైమ్ బ్యాక్ డ్రాప్ సినిమా ఇద‌ని టైటిల్ - ట్యాగ్ లైన్ తోనే తేలిపోయింది. డాక్ట‌ర్ శైలేష్ కొల‌ను ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆయ‌నే ర‌చ‌యిత‌. నాని స్టైలిస్ట్ ప్ర‌శాంతి తిపుర్ నేని ఈ చిత్రానికి నిర్మాత‌.

సైలెంట్ గా సినిమా స్టార్ట్ చేసి పూర్తి చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు తొలి గ్లింప్స్ కి టైమొచ్చింది. కొత్త సంవ‌త్స‌రం కానుక‌గా తొలి గ్లింప్స్ ని జ‌న‌వ‌రి 1న రివీల్ చేయ‌నున్నామ‌ని తాజాగా నాని-ప్ర‌శాంతి బృందం ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు విశ్వ‌క్ సేన్ లుక్ తో ప్రీ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ- వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు.