Begin typing your search above and press return to search.

దేవ‌ర‌కొండ‌ను ఆ మాట అన‌లేద‌ట‌!

By:  Tupaki Desk   |   3 Jun 2019 12:15 PM GMT
దేవ‌ర‌కొండ‌ను ఆ మాట అన‌లేద‌ట‌!
X
ప్ర‌స్తుతం ఏ నోట విన్నా.. దాసు అలియాస్ విశ్వ‌క్ సేన్ గురించే వినిపిస్తోంది. ఫ‌క్తు మాస్ మ‌హారాజాలా హైద‌రాబాదీ యాస‌తో అద‌ర‌గొట్టేస్తున్నాడు. ఈ కుర్రాడు మాట‌ల మ‌రాఠీకి జెరాక్స్ కాపీలా ఉన్నాడు. నాని- దేవ‌ర‌కొండ లా ఫ్రీఫ్లోతో మాట్లాడుతూ అద‌ర‌గొడుతున్నాడు. అయితే అత‌డు న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఫ‌ల‌క్ నుమా దాస్` చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఎంతో నేచుర‌ల్ గా రియ‌లిటీకి ద‌గ్గ‌ర‌గా తెర‌కెక్కించిన ఈ సినిమా అనుభ‌వ లేమి వ‌ల్ల ద‌ర్శ‌క‌త్వ విభాగంలో విశ్వ‌క్ ఫెయిల‌య్యాడ‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. న‌టుడిగా విశ్వ‌క్ పెర్ఫామెన్స్ ని మాత్రం క్రిటిక్స్ పొగిడేశారు.

ఇక‌పోతే ఇటీవ‌ల ప్రీరిలీజ్ వేడుక‌లో విశ్వక్ చేసిన ఓ కామెంట్ జోరుగా వైర‌ల్ అయ్యింది. ``ఒక‌డిని నెత్తిన పెట్టుకున్నాం`` అంటూ అత‌డు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై కామెంట్ చేశాడ‌ని ప్ర‌చారం సాగింది. దేవ‌రకొండ - త‌రుణ్ భాస్క‌ర్ (ద‌ర్శ‌కన‌టుడు) బృందానికి విశ్వ‌క్ ఎంతో స‌న్నిహితుడు కావ‌డంతో మ‌న‌స్ఫ‌ర్థ‌ల వ‌ల్ల‌ అత‌డు దేవ‌ర‌కొండ‌పైనే పంచ్ వేశాడ‌ని మాట్లాడుకున్నారంతా. ఆ క్ర‌మంలోనే రౌడీ దేవ‌ర‌కొండ‌ ఫ్యాన్స్ సామాజిక మాధ్య‌మాల్లో విశ్వ‌క్ పై కౌంట‌ర్లు వేశారు. ఎపిసోడ్ ఎపిసోడ్లుగా ఈ వివాదం రాజుకుంటూనే ఉంది. ప్ర‌తి ఇంట‌ర్వ్యూలో దీనిపై అత‌డు వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌స్తోంది.

తాజాగా ఓ యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై మ‌రోసారి వివ‌ర‌ణ ఇచ్చాడు. విశ్వ‌క్ మాట్లాడుతూ..``ప్రీరిలీజ్ లో జ‌రిగిన‌దానిపై క్లారిటీనిస్తా. చాలా మంది యూట్యూబ్ కింద కామెంట్స్ లోనే క్లారిటీ ఇచ్చేశారు. అరే.. వాడ‌న్న‌ది హీరోని కాద్రా.. వాడ‌న్న‌ది ఒక ప్రొడ్యూస‌ర్.. ఇండ‌స్ట్రీలో ఒక బ్యాచ్ ని.. ఒక చిన్న ప్రొడ్యూస‌ర్ ని అని క్లారిటీ వ‌చ్చేసింది. ఆల్రెడీ ఒక‌డిని లేపినం! అని అన్న‌ది ఓ నిర్మాత‌ను ఉద్ధేశించి మాత్ర‌మే``న‌ని క్లారిటీనిచ్చారు. ``అస‌లు న‌న్ను లేపిన‌ది ఎవ‌రు? నీ ఆఫీస్ బ‌య‌ట కూచుంటే అవ‌కాశం ఇచ్చావా? నాకు ఎవ‌రైనా లైఫ్ ఇచ్చిన‌వాళ్ల‌ను ఈ మాట‌న్నాను! అంటే అర్థం ఉంది. డ‌బ్బులు పెట్టుకుని నేనే అంద‌రికీ అవ‌కాశాలిచ్చాను. నా క‌ళ్ల‌కు క‌నిపించిన ట్యాలెంటును ప‌ట్టుకుని సినిమా తీస్తే అది థియేట‌ర్ల‌లో సినిమా న‌డుస్తోంది``అని విశ్వ‌క్ వివ‌ర‌ణ ఇచ్చారు. ట్యాలెంట్ ఉండి చాలా మందికి అవ‌కాశాలు రావ‌డం లేద‌ని నాకు తెలుసు. నేను కూడా ఆఫీసుల ముందు ఎదురు చూస్తే అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని విశ్వ‌క్ అన్నారు. మొత్తానికి వివాదాల‌తో ప్ర‌చారం కొట్టేస్తున్నాడు ఫ‌ల‌క్ నుమా దాసు.