Begin typing your search above and press return to search.

పాగ‌ల్ ఓటీటీ రిలీజ్ పై విశ్వ‌క్ క్లారిటీ

By:  Tupaki Desk   |   18 May 2021 9:30 AM GMT
పాగ‌ల్ ఓటీటీ రిలీజ్ పై విశ్వ‌క్ క్లారిటీ
X
ఈ న‌గ‌రానికి ఏమైంది? .. ఫ‌ల‌క్ నుమా దాస్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు విశ్వ‌క్ సేన్. హైద‌రాబాదీ `మాస్ కా దాస్` అంటూ విశ్వ‌క్ కి అభిమానగ‌ణం ఏర్ప‌డింది. సంక్రాంతికి వ‌చ్చిన క్రైమ్ థ్రిల్ల‌ర్ `హిట్` లో కాప్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. అత‌డి ఎంపిక‌ల్లో వైవిధ్యం యువ‌త‌రానికి క‌నెక్ట‌వుతోంది. అందుకే అత‌డు న‌టించిన తాజా చిత్రం `పాగ‌ల్`పై ఆస‌క్తి నెల‌కొంది.

సెకండ్ వేవ్ లేక‌పోతే ఈ పాటికే ఈ చిత్రం రిలీజ‌య్యేది. కానీ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. ఆ క్ర‌మంలోనే పాగ‌ల్ ని ఓటీటీకి విక్ర‌యించార‌ని త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ అయిపోతోంద‌ని ప్ర‌చార‌మైంది.

అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేద‌ని విశ్వ‌క్ సేన్ వెల్ల‌డించారు. పాగ‌ల్ థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం వేచి చూస్తోంద‌ని దీనిని బ‌ట్టి క్లారిటీ వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇటీవ‌ల‌ విడుద‌లైన పాట హైప్ క్రియేట్ చేసింది. విశ్వ‌క్ మ‌రో వైవిధ్య‌మైన చిత్రంతో ఆక‌ట్టుకుంటాడ‌నే న‌మ్మ‌కం అభిమానుల్లో వ్య‌క్త‌మైంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.