Begin typing your search above and press return to search.

ఏదైతేనేం విశ్వక్ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ దొరికిందిగా..!

By:  Tupaki Desk   |   2 May 2022 3:34 PM GMT
ఏదైతేనేం విశ్వక్ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ దొరికిందిగా..!
X
'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ హీరో మాస్​ కా దాస్​ విశ్వక్​ సేన్​ చేసిన ఓ ఫ్రాంక్ వీడియో వ్యవహారం వివాదంగా మారింది. సినిమా రివ్యూలు అంటూ అతి చేసే ఓ యువకుడి చేసిన సూసైడ్ ఫ్రాంక్ లో భాగమయ్యారు విశ్వక్. అయితే ప్రమోషన్స్ పేరుతో పబ్లిక్ ప్లేస్ లో ఈ న్యూసెన్స్ ఏంటని నెటిజన్లు ఫైర్ అయ్యారు.

విశ్వక్ సేన్ పై ఓ అడ్వకేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు కూడా. ఈ క్రమంలోనే విశ్వక్​ సేన్​ మరియు చిత్ర పరిశ్రమకు చెందిన త్రిపురనేని చిట్టితో టీవీ9 న్యూస్ ఛానల్ డిబెట్ నిర్వహించింది. కేసు ఫైల్ చేసిన లాయర్ ను కూడా లైన్ లోకి తీసుకొచ్చారు. అయితే కొంతసేపు నడిచిన తర్వాత చర్చ పక్కదారి పట్టింది.

ఆ యాంకర్ 'పాగల్ సేన్' 'డిప్రెస్డ్ పర్సన్' అంటూ సంబోధించడంతో హార్ట్ అయిన విశ్వక్ సేన్.. తనను పర్సనల్ గా టార్గెట్ చేసి కించపరిచినందుకు పరువునష్టం దావా వేసే హక్కు ఉందని.. కానీ అలా చేస్తే వారికి తనకు తేడా ఏముందన్నారు. ఈ క్రమంలో ఈమధ్య యూత్ ఊత పదంగా మారిన ఓ బూతును కూడా వాడాడు.

దీంతో సహనం కోల్పోయిన యాంకరమ్మ.. గెట్ అవుట్ ఆఫ్ మై స్టుడియో అంటూ గట్టిగా అరిచింది. మీరే ఇంటర్వ్యూకి పిలిచి.. మీరే నన్ను మాటలు అంటున్నారు అని చెబుతూ విశ్వక్ బయటకు వచ్చేసారు. అయినా సరే ఆ యాంకర్ ఆగకుండా నోరుమూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అరవడం సంచలనంగా మారింది.

ఇదే ఇప్పుడు సదరు యాంకర్ పై న్యూస్ ఛానల్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చేలా చేసింది. డిబేట్ కు ఒక హీరోని పిలిచి 'గెట్ అవుట్' అంటూ బయటకు పంపించడం పై విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ఆ యాంకర్ తనే న్యూస్ ఛానల్ కు ఓనర్ లా ఫీల్ అవుతూ.. స్టూడియో నుంచి వెళ్లిపోమని ఆదేశించడం పై నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు.

'డీజే టిల్లు' సినిమాలో హీరో తన తండ్రితో చెప్పే డైలాగ్ ని దీనికి అన్వహిస్తూ.. 'నువ్ ఆ స్టూడియోలో వర్క్ చేస్తావ్ అంతే.. ఆ స్టూడియో నీది కాదు' అని కామెంట్స్ పెడుతూ యాంకర్ ని ట్రోల్ చేస్తున్నారు. ఏ ఇష్యూ దొరికినా మధ్యలోకి దూరాలని ఎదురు చూసే డదర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా విశ్వక్ vs టీవీ9 యాంకర్ వివాదంలో ఎంటర్ అయ్యారు.

'ఒక పురుషుడి కన్నా ఓ మహిళ పవర్ ఫుల్ గా కనిపించడం నేను ఇంతవరకు చూడలేదు. ఆమె సర్కార్ కన్నా తక్కువేం కాదు' అంటూ ఓ ట్వీట్ చేసిన ఆర్జీవీ.. సదరు యాంకర్ ను ట్యాగ్ చేశాడు. అయితే వర్మ వ్యంగ్యంగా అంటున్నాడో.. సీరియస్ గా చెప్తున్నాడో అర్థం కావట్లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అయితే టీవీ9 న్యూస్ ఛానల్ దీన్ని అంత ఈజీగా వదిలేయకూడదని అనుకుందో ఏమో.. స్టూడియోలో విశ్వక్ సేన్ పిచ్చి వేషాలు స్పెషల్ ప్రోగ్రామ్ చేసింది. అందులో విశ్వక్ స్వీట్స్ తెచ్చి యాంకర్ కు ఇవ్వడం.. మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తాను కూడా ఓట్లు వేశానని చెప్పడం కనిపించింది.

అయితే లైవ్ లో యాంకర్ గెటవుట్ అంటూ గట్టిగా అరిచిన వీడియోని డిలీట్ చేసి.. పిచ్చి వేషాలు అంటూ ఆఫ్ ది రికార్డ్ విశ్వక్ సేన్ వీడియోని పోస్ట్ చేయడంపై నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. నిన్నటి నుంచి ఫ్రాంక్ వీడియో మీద విశ్వక్ ని ట్రోల్ చేసిన నెటిజన్లు.. డిబేట్ లో జరిగిన ఇష్యూతో న్యూస్ ఛానల్ మరియు యాంకర్ మీద పడ్డారు. వీరిపై నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ - టీవీ9 యాంకర్ మధ్య మాటల యుద్ధం సీరియస్ గా జరిగినా.. ఇది కూడా ఫ్రాంక్ అని కొందరు కామెంట్స్ చేశారు. గతంలో స్టూడియోలలో కెమెరాల ముందు తిట్టుకున్న వాళ్ళు.. బయటకొచ్చి కలిసి కాఫీలు తాగిన సందర్భాలు ఉన్నాయి. అందులోనూ ఈ మధ్య రేటింగ్స్ తక్కువ వస్తున్నాయని ఇలా కావాలని ప్లాన్ చేశారేమో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏదైతేనేం ఈ వ్యవహరమంతా విశ్వక్ సేన్ సినిమాకు రిలీజ్ కు ముందు కావాల్సినంత ప్రమోషన్ తెచ్చిపెట్టింది. ఏ హీరో అయినా తన చిత్రానికి ప్రచారం కావాలనే కోరుకుంటాడు. ఇప్పుడు 'అశోకవనంలో అర్జున కల్యాణం' మూవీ విషయంలో అదే జరిగింది. ఇప్పటి వరకు అసలు ఇలాంటి సినిమా ఉందని తెలియని వాళ్ళు కూడా.. ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ వివాదం పరోక్షంగా విశ్వక్ కు మేలు చేస్తే.. టీవీ9 స్టూడియోను విమర్శలపాలు చేసిందనేది అర్థం అవుతుంది.