Begin typing your search above and press return to search.

ఆ సీక్వెల్ అవసరమా దాసూ

By:  Tupaki Desk   |   7 Jun 2019 5:30 PM GMT
ఆ సీక్వెల్ అవసరమా దాసూ
X
అనవసర వివాదాలతో లేని పోనీ వీడియోలతో రచ్చ చేసుకున్న విశ్వక్ సేన్ ఎవరు ఔనన్నా కాదన్నా తన సినిమా ఫలక్ నుమా దాస్ బ్లాక్ బస్టర్ అంటున్నాడు. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉన్నప్పటికీ అది ఒప్పుకోవడానికి ఈ హీరో కం దర్శకుడు సిద్ధంగా లేడు. ఇవాళ నిర్వహించిన సక్సెస్ మీట్ లో దీనికి సీక్వెల్ వచ్చే ఏడాది విడుదల చేస్తానని ఇంత కన్నా బోల్డ్ కంటెంట్ మాటలతో వస్తానని ప్రకటించడం అందరిని షాక్ కి గురి చేసింది.

అసలు తీసిందే మలయాళం రీమేక్. అదీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఏదో హైదరాబాద్ నేటివిటీ ఫాక్టర్ వల్ల ట్విన్ సిటీస్ లో ఓ మాదిరిగా ఆడినా మిగిలిన ఏరియాలలో మాత్రం దేబ్బేసింది. ఇది వసూళ్ళ రూపంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కాని దాన్ని లెక్కచేయకుండా ఫలక్ నుమా దాస్ ని కొనసాగింపు తీస్తానని చెప్పడం ఓవర్ కాన్ఫిడెన్సో లేక తనను దెబ్బ తీశారు కాబట్టి రివెంజ్ కోసమైనా ఇంకొకటి తీసి చూపించాలన్న ఫీలింగో అర్థం కావడం లేదు.

దీని గోల వదిలేసి మంచి టెక్నీషియన్ కం దర్శకుడు తనలో ఉన్నాడని రుజువు చేసుకున్న విశ్వక్ సేన్ ఏదైనా ఫ్రెష్ సబ్జెక్టు ట్రై చేయడం బెటర్. లేదా ఇదే హాంగ్ ఓవర్ లో అదే మటన్ బిజినెస్ అదే మందు కొట్టడం అదే కొట్టుకోవడం కంటిన్యూ చేస్తే ఈ మాత్రం రెస్పాన్స్ కూడా దానికి వచ్చేది అనుమానమే. ఈ పాయింట్ మీదే సోషల్ మీడియాలో ఇప్పుడు కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. ప్రకటన వరకే పరిమితమా లేక నిజంగా ఫలక్ నుమా దాస్ కి సీక్వెల్ తీస్తాడా అనేది కొద్దిరోజులు ఆగితే కాని క్లారిటీ రాదు