Begin typing your search above and press return to search.

సన్నీలియోన్ తో ఇవేం ఆటలు విష్ణూ..!

By:  Tupaki Desk   |   15 April 2022 9:52 AM GMT
సన్నీలియోన్ తో ఇవేం ఆటలు విష్ణూ..!
X
టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ''గాలి నాగేశ్వరరావు''. ఇందులో పాయల్ రాజ్ పుత్ తో పాటుగా హాట్ బ్యూటీ సన్నీ లియోన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే షూటింగ్ గ్యాప్ లో సన్నీ తో విష్ణు ఫన్నీ గేమ్స్ ఆడుతూ సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా సన్నీలియోన్ ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేస్తూ ఈ గేమ్ ని ఇష్టపడ్డాను అని పోస్ట్ పెట్టింది. ఇందులో మంచు విష్ణు - శివ బాలాజీ - సన్నీ కలిసి ఫన్నీ గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. బాటల్స్ తో కొట్టుకునే ఈ ఆటలో ముగ్గురూ సరదా సమయాన్ని గడుపుతున్నారు. దీనికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. సన్నీతో విష్ణు ఫన్నీ గేమ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఇకపోతే సన్నీ ఇటీవల మంచు విష్ణును భయపెట్టేందుకు ప్రయత్నించి విఫలమైన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. సన్నీ ఫేస్ మాస్క్ తో గోడచాటున దాక్కొని అతడ్ని భయపెట్టాలని చూడగా.. మంచు విష్ణు ఆమెను అలా చూసి ఏ మాత్రం భయపడడు.

అయితే ఆ తర్వాత మాస్క్ తీయగానే సన్నీ ఒరిజినల్ ఫేస్ చూసి భయంతో వణికిపోతున్నట్లు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి పరుగులు తీస్తాడు. ఇదే క్రమంలో లేటెస్టుగా మరో గేమ్ తో సందడి చేశారు.

'గాలి నాగేశ్వరరావు' సినిమాలో రేణుక అనే ఎన్నారై యువతి పాత్రలో సన్నీ లియోన్ కనిపించనుంది. గతంలో మంచు మనోజ్ నటించిన 'కరంట్ తీగ' చిత్రంలో సన్నీ స్పెషల్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు సోదరుడు విష్ణు సరసన హీరోయిన్ గా ఆడిపాడుతోంది.

మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న 'గాలి నాగేశ్వరరావు' చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. జి. నాగేశ్వరరరెడ్డి మూల కథ అందించగా.. కోన వెంకట్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న విష్ణు.. ఈ సినిమాటతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.