Begin typing your search above and press return to search.
మంచు మనోజ్ పెళ్లిపై విష్ణు మౌనమేల?
By: Tupaki Desk | 7 March 2023 10:03 AMచాలా కాలం నుంచి జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ మంచు మనోజ్ తన ప్రేయసి భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు. మార్చి మూడవ తేదీ సాయంత్రం 8:30 గంటలకు వీరి వివాహం హైదరాబాదులోని మంచు లక్ష్మి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంచు విష్ణు, మంచు మోహన్ బాబు సహా మంచు లక్ష్మీ దంపతులు కూడా హాజరయ్యారు. అయితే మంచు మోహన్ బాబు మంచు లక్ష్మి సహా మిగతా కుటుంబ సభ్యులందరూ వివాహం పూర్తయ్యే వరకు ఉండి ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళితే మంచు విష్ణు మాత్రం చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
అలాగే మంచు లక్ష్మి, మంచు మనోజ్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ నీ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఏవేవో విషయాల మీద కూడా స్పందించే మంచు విష్ణు ఈ విషయం మీద స్పందించకపోవడం... మంచు విష్ణు మంచు మనోజ్ పెళ్లి ఫోటోల్లో కూడా ఎక్కడా కనపడక పోవడం... అలాగే సోషల్ మీడియాలో కూడా ఆయన విష్ చేసిన దాఖలాలు లేవు. వాస్తవానికి ఇది వారి కుటుంబ వ్యవహారం. కానీ సెలబ్రిటీలు కావడంతో ఎందుకు తమ్ముడు వివాహ వ్యవహారాల్లో మంచు విష్ణు ప్రమేయం లేదనే విషయం మీద చర్చ జరుగుతోంది.
బహుశా మంచు విష్ణు పర్సనల్ గా మంచు మనోజ్ కి వివాహ శుభాకాంక్షలు చెప్పి ఉండవచ్చు. కానీ మంచు అభిమానులు సైతం ఇదే విషయాన్ని ఇప్పుడు చర్చించుకుంటున్నారు. మంచు విష్ణు ఎందుకు మంచు మనోజ్ వివాహంలో యాక్టివ్ పార్ట్ తీసుకోలేదు. ఎందుకు మిగతా కుటుంబ సభ్యుల లాగా ఎక్కువ సమయం వెచ్చించలేదు అనే విషయం మీద చర్చ జరుగుతోంది.
అయితే వాస్తవానికి మంచు మనోజ్ వివాహం జరిగిన రోజే మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఒక మెడికల్ క్యాంపు నిర్వహించారు. బహుశా పనుల్లో బిజీగా ఉండి తమ్ముడు పెళ్లి విషయం మీద ఎక్కువ దృష్టి పెట్టలేదేమో అనే వాదన వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.