Begin typing your search above and press return to search.

ఈ యాంకర్ ని ఇలా ఎప్పుడైనా చూసారా...?

By:  Tupaki Desk   |   26 April 2020 7:23 AM GMT
ఈ యాంకర్ ని ఇలా ఎప్పుడైనా చూసారా...?
X
లాక్‌ డౌన్ వ‌ల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవ‌డంతో సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో సినిమా షూటింగ్స్ కూడా బంద్ కావడంతో సెలబ్రెటీలు ఇళ్లలోనే ఉంటూ తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన పలు సమాచారాలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమకి నచ్చిన పనులు చేస్తూ.. ఇంటి స‌భ్యుల‌తో స‌ర‌దాగా స‌మయాన్ని గ‌డుపుతున్నారు. కొత్త కొత్త ఛాలెంజ్ లను పరిచయం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. కొందరు ఇంట్లోనే ఉంటూ బోర్ కొడుతుండ‌డంతో సోష‌ల్ మీడియాలో ర‌క‌రకాల పోస్టులు పెడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు చేసే వంటల వీడియోలను.. వర్క్ ఔట్ వీడియోలను.. డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా పాపులర్ యాంకర్ విష్ణు ప్రియ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్‌లో ఉన్న యాంకర్స్‌లో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యాంకర్ విష్ణు ప్రియ. పోవే పోరా షోతో బాగా పాపులర్ అవుతుంది విష్ణు ప్రియ. బుల్లితెరపై ఎంటర్‌టైన్‌మెంట్ షోలతో ఆకట్టుకునే విష్ణు ప్రియకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌ తో ఉన్న దోస్తానా కారణంగా ఈమెకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. హీరోయిన్స్‌కి ఏ మాత్రం తీసుపోని గ్లామర్‌ని మెయిన్‌టైన్ చేస్తూ వాళ్లతో పాటు సమానంగా క్రేజ్ దక్కించుకుంటోంది. ఇక ప్రస్తుతం క్వారంటైన్‌ లో ఉన్న ఈ బుల్లితెర బ్యూటీ హాట్ వర్కౌట్స్ తో కేక పుట్టింస్తుంది. వర్కౌట్ అంటే అలాంటి ఇలాంటి వర్కౌట్ కాదు.. తనకు బాగా నచ్చిన వచ్చిన డాన్స్‌‌ నే వర్కౌట్స్ మంత్రంగా మార్చుకుంది. మాంచి ఊపు మీద పాటకు అంతే ఎనర్జీగా స్టెప్స్ వేసి మతి పోగొట్టింది. నడుముని బొంగరంలా గింగిరాలు తిప్పుతూ మీరు కూడా ఇలాంటి వర్కౌట్స్‌ని ట్రై చేయండి.. మంచి కిక్ ఇస్తుంది అంటూ స్టెప్పులతో రచ్చ చేసే వీడియోను పోస్ట్ చేసింది. ఇక మూమెంట్స్ చేసేటప్పుడు ఇచ్చిన హాట్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే అదిరిపోయాయనే చెప్పాలి. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం విష్ణు ప్రియ డాన్స్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.