Begin typing your search above and press return to search.

వీడియో: యంగ్ అండ్ హాట్ యాంక‌ర్ డ్యాన్సులు అదుర్స్

By:  Tupaki Desk   |   30 Aug 2021 10:03 AM GMT
వీడియో: యంగ్ అండ్ హాట్ యాంక‌ర్ డ్యాన్సులు అదుర్స్
X
బుల్లితెర యాంక‌ర్లు పెద్ద తెర‌పైనా అదృష్టం ప‌రీక్షించుకుని బిజీ స్టార్లుగా ఎదిగేస్తున్న సంగ‌తి తెలిసిందే. వెట‌ర‌న్ల‌లో ఝాన్సీ-సుమ‌- శిల్పా చ‌క్ర‌వ‌ర్తి స‌హా ఎంద‌రో యాంక‌ర్లు న‌టీమ‌ణులుగా రాణించారు. యాంకర్ అన‌సూయ‌.. రేష్మి గౌత‌మ్ ఇటీవ‌ల త‌మ స్టార్ డ‌మ్ ని పెంచుకుని ముందుకు సాగిపోతున్నారు.

సీనియ‌ర్ల బాట‌లోనే ఇపుడు ట్రెండీ యంగ్ యాంక‌ర్ విష్ణుప్రియ వెండితెర డ్రీమ్స్ ని నెర‌వేర్చుకునేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఓవైపు బుల్లితెర హోస్ట్ గా రాణిస్తూనే మ‌రోవైపు సినీనాయిక‌గా ప్ర‌య‌త్నాలు సాగిస్తున్న ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ‌ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటోంది. విష్ణు ప్రియ స్పెష‌ల్ ఫోటోషూట్లు సోష‌ల్ మీడియాల్లో షేక్ చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు ఈ భామ వండ‌ర్ ఉమెన్ గెట‌ప్ తో అంద‌రి అటెన్ష‌న్ ని త‌న‌వైపు తిప్పేసుకుంది. ర‌క‌ర‌కాల ఫోటోషూట్ల‌తో అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది.

విష్ణుప్రియ వెండితెర య‌త్నాలు చాలా కాలంగా సాగుతున్న‌వే. చాలా సినిమాల‌లో ఈ బ్యూటీ సైడ్ క్యారెక్ట‌ర్స్ పోషించింది. చెక్ మేట్ అనే సినిమాలోనూ ఈ భామ న‌టించింది. కానీ అంత‌గా గుర్తింపు ద‌క్క‌లేదు. బుల్లితెర యాంక‌ర్ గా కుర్ర‌కారు హృద‌యాల‌ను గెలుచుకుంది. పోవే పోరా అనే టీవీ షోతో పాపులారిటీ తెచ్చుకున్న విష్ణు ప్రియ.. ఈటీవీలో ప‌లు రియాలిటీ షోల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక‌పై పెద్ద తెర క‌ల‌ల‌తో ఈ అమ్మ‌డు అన్ లిమిటెడ్ ట్రీటిస్తోంది.

తాజాగా ఈ భామ షేర్ చేసిన ఓ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ``జ‌న్మాష్ఠమి వైబ్స్ .. అలాగే నా ఫేవ‌రెట్ సండే!`` అంటూ ల‌వ్ ఈమోజీల‌ను షేర్ చేసింది ఈ వీడియోతో. త‌న ఫేవ‌రెట్ హిందీ సాంగ్ ట్రాక్ ప‌ర‌మ్ సుంద‌రికి అదిరిపోయే స్టెప్పులు వేసింది విష్ణు ప్రియ‌. వంగ‌పువ్వు రంగు లంగా అదే క‌ల‌ర్ టాప్ లో గ్లామ‌ర‌స్ ఎలివేష‌న్ తో విష్ణు ప్రియ మెరుపులు మెరిపించింది. ప్ర‌స్తుతం ఈ డ్యాన్సింగ్ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

నేటిత‌రానికి వెండితెర బుల్లితెర‌తో పాటు డిజిట‌ల్ కూడా మ‌రో గొప్ప వ‌రంగా మారింది. ఈ వేదిక‌పై అన్ లిమిటెడ్ గా సిరీస్ లు తెర‌కెక్కుతున్నాయి. వీటిలో కొత్త‌వారికి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. ప్ర‌య‌త్నించ‌క‌పోతే అది ఆర్టిస్టు లోపం అన్న తీరుగానే ఉంది. ఇటీవ‌లి కాలంలో జూనియ‌ర్ ఆర్టిస్టులు సైతం మెయిన్ స్ట్రీమ్ స్టార్లుగా ఎదిగేస్తున్నారు. మ‌రి యాంక‌ర్ల‌కు ఇది మ‌రో గొప్ప స‌ద‌వ‌కాశం అనే చెప్పాలి.