Begin typing your search above and press return to search.

CK బ్యూటీని ఫాలో చేస్తున్న హాట్ తెలుగు యాంక‌ర్

By:  Tupaki Desk   |   6 Nov 2021 1:30 AM GMT
CK బ్యూటీని ఫాలో చేస్తున్న హాట్ తెలుగు యాంక‌ర్
X
టాలీవుడ్ లో యాంక‌ర్ల న‌డుమ ఊహించని పోటీ క‌నిపిస్తోంది. అన‌సూయ‌- రేష్మి లాంటి హాట్ యాంక‌ర్ల‌కు ధీటుగా పోటీ ప‌డేందుకు న‌వ‌త‌రం యాంక‌ర్లు కూడా రేసులోకి దూసుకొచ్చారు. పోరా పోవే ఫేం యాంక‌ర్ విష్ణు ప్రియ భీమ‌నేని ఇటీవ‌ల బోల్డ్ ఫోటోషూట్ తో స్ట్రైకింగ్ రేట్ పెంచుకున్న సంగ‌తి తెలిసిందే. విష్ణు ప్రియ వ‌రుస ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా బుల్లితెర అభిమానులు విష్ణు ప్రియ‌ను సోష‌ల్ మీడియాల్లో అనుస‌రిస్తున్నారు.

అదే క్ర‌మంలో ప‌లు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లకు సంబంధించిన అవ‌కాశాల్ని విష్ణు ప్రియ అందుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ మహిళల కోసం ఇంటెన్స్ లిమిటెడ్ ఎడిషన్ - 100 ML పెర్ఫ్యూమ్ బ్రాండ్ కి ప్ర‌చార‌క‌ర్త‌గా ఎంపికైంది. ఇన్ స్టా మాధ్య‌మంలో విష్ణు ప్రియ హాటెస్ట్ ఫోటోషూట్ ఈ ఉత్ప‌త్తికి ప్ర‌మోష‌న‌ల్ మైలేజ్ ని పెంచుతోంది. తెలుగ‌మ్మాయ్ ఆల్మోస్ట్ టాప్ లెస్ మోడ్ లో క‌నిపించింది. ఇన్న‌ర్ ధ‌రించ‌కుండా క్లాసీ సూట్ లుక్ లో క‌నిపించింది ప్రియా. ఈ లుక్ ని చూడ‌గానే అభిమానులు ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. CK బ్యూటీ దిశా ప‌టానీని ఫాలో చేస్తున్న హాట్ తెలుగు యాంక‌ర్ అంటూ కొంద‌రు వ్యాఖ్య‌ల్ని జోడిస్తున్నారు.

ఇన్ స్టా పోస్టింగ్ లో పెర్ఫ్యూమ్ కి ఇన్ స్టాలో విష్ణు ప్రియ సుదీర్ఘ నోట్ ని జ‌త చేసింది. నేను వ్య‌క్తిగ‌తంగా మెచ్చే పెర్ఫ్యూమ్ ఇది. ఈ ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్ నాకు చాలా ఇష్టమైనది. ఇది నా అత్యంత సన్నిహిత మిత్రులైన సుహాసిని  కూతురు (అమ్ము పాపా)కి అంకితమిచ్చాను. మీరు పూర్తి-పరిమాణ బాటిల్‌ను కొనుగోలు చేయడానికి ముందు నిర్దిష్ట సువాసన 3ఎంఎల్ నమూనాను కొనుగోలు చేయడానికి అవ‌కాశం ఉంది. నమూనాను పరీక్షించి అది ఆశించినంత‌గా బాగుందో లేదో చూడవచ్చు.  శాంపిల్ న‌చ్చితే మీరు పూర్తి పరిమాణ బాటిల్ ను కొనుగోలు చేయవచ్చు.. అంటూ ప్ర‌చారం సాగిస్తోంది.  మొత్తానికి కార్పొరెట్ ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా విష్ణు ప్రియ‌కు అవ‌కాశాలు మెరుగ‌వుతున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌రోవైపు బుల్లితెర‌పైనా ఈ బ్యూటీ దూసుకుపోతోంది. సినిమా అవ‌కాశాల కోసం గాలం వేస్తోంది.

విష్ణుప్రియ భీమినేని .. బుల్లితెర హోస్ట్ గా అసాధార‌ణ పాపులారిటీ పెంచుకోవ‌డంలోనే కాదు.. సామాజిక మాధ్య‌మాల్లో అభిమానులను ఎలా ఆకర్షించాలో ఆమెకు ఖచ్చితంగా తెలుసు. విష్ణుప్రియ కొంతకాలంగా  యువ‌త‌రంలో గొప్ప ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అదే క్ర‌మంలో 2020 మోస్ట్ డిజైర‌బుల్ జాబితాలో టాప్ 2లో నిలిచింది. ఆ త‌ర్వాత త‌న‌కు అవ‌కాశాల రేంజు పెరిగింది.